స్వేచ్ఛ వాయువులతో ఊపిరి పోసుకుంటున్న భారతదేశానికి ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలో నేర్పించిన వ్యక్తి సర్ రామసామి చెట్టి కందసామి షణ్ముకం చెట్టి. ఈయన న్యాయవాది, ఆర్థికవేత్త, రాజకీయ వేత్త అంతేకాదు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా సేవలు అందించి నేటి ఆర్థికవ్యవస్థకు పునాది వేసిన ఆర్కే షణ్ముకం చెట్టి.
చెట్టి అక్టోబర్ 17,1892న కోయంబత్తూర్‌లోని వానియార్ స్ట్రీట్‌లో కందసామి చెట్టికి జన్మించారు. షణ్ముకం చెట్టి విద్యాభ్యాసం కోయంబత్తూరులో పూర్తి చేశారు. అనంతరం మద్రాస్ క్రిస్టియన కాలేజీ నుంచి ఆర్తికశాస్త్రంలో పట్టభద్రుడు అయ్యారు. అలాగే మద్రాసు న్యాయకళాశాల నుండి న్యాయపట్టా అందుకున్నారు. షణ్ముకుం చెట్టి 1917లో జస్టిస్ పార్టీలో చేరారు. అనంతరం అంచెలుంచెలుగా ఎదిగి మద్రాస్ లెజిస్లేటీవ్ కౌన్సిల్ సభ్యునిగా ఎదిగారు. 1935 నుండి 1941వరకు కొచ్చిన్ దివాన్‌గా పనిచేశారు.
జవహర్‌లాల్ నెహ్రూ కోరిక మేరకు మహాత్మా గాంధీ పిలుపుమేరకు భారతదేశ తొలి ఆర్థిక మంత్రిగా సేవలందించారు. అయితే కొద్ది రోజులకే నెహ్రూతో విభేదాల కారణంగా చెట్టి రాజీనామా చేశారు. మొదటి పారిశ్రామిక తీర్మానం చేసిన ఆర్దికమంత్రిగా చెట్టి చరిత్రకెక్కారు. అంతేకాదు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మిశ్రమ ఆర్థికవ్యవస్థగా రూపాంతరం చెందడంలో ప్రముఖ పాత్ర పోషించారు.
Also Read: ప్రపంచ కార్టూనిస్ట్ డే..
చెట్టి తన మొదటి బడ్జెట్ ప్రసంగాన్ని ఇలా ప్రారంభించేవారు. నేను స్వేచ్ఛా మరియు స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి బడ్జెట్‌ను సమర్పించబోతున్నాను. ఇది చాలా ముఖ్యమైన సందర్భంగా పరిగణించబడుతుంది మరియు ఆర్థిక మంత్రిగా ఈ బడ్జెట్‌ను సమర్పించడం అరుదైన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఈ స్థానానికి ఉన్న గౌరవం గురించి నాకు తెలుసు, ఈ క్లిష్ట సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవహారాల సంరక్షకుడు ఎదుర్కొంటున్న బాధ్యతల గురించి నాకు మరింత అవగాహన ఉంది అని మొదటి బడ్జెట్ ప్రసంగం చేశారు. చెట్టి మే3,1953లో గుండెపోటు వచ్చింది. కానీ రెండవ సారి మే5న ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. షణ్ముకం చెట్టి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ది ఇండియన్ ఎంపైర్‌గా 3 జూన్ 1933న నియమించింది బ్రిటీష్ ప్రభుత్వం. కాగా నేడు ఆయన వర్థంతి.
Also Read: Birthday:తొలి సిక్కు రాష్ట్రపతి జైల్ సింగ్