సాధారణ కార్యకర్త నుండి సీఎంగా..

56
- Advertisement -

బీజేపీలో సాధారణ కార్యకర్త నుండి సీఎం వరకు ఎదిగిన నాయకుడు మనోహర్ లాల్ ఖట్టర్. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ చేసిన నేత. హర్యానా రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. వరుసగా రెండుసార్లు 2014,2019లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి సీఎంగా కొనసాగుతున్నారు.

మే 5 1954లో మ‌హ‌మ్ లో జన్మించారు. తండ్రి పేరు హ‌ర్‌బ‌న్స్ లాల్ ఖ‌ట్ట‌ర్ తల్లి. ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యంలో చ‌దువుతున్న‌ప్పుడే ఖ‌ట్ట‌ర్ ఢిల్లీలోని స‌దార్‌ బ‌జార్ ప్ర‌క్క‌న షాపును నడిపారు. తొలినాళ్ల‌లో జీవ‌నం గ‌డ‌వ‌డం కోసం ట్యాషన్ కూడా చెప్పారు. 1977లో ఆర్ఎస్ఎస్‌లో చేరారు. మూడేళ్ల త‌ర్వాత ఆయ‌న ఆర్ఎస్ఎస్‌లో పూర్తిస్థాయి ప్ర‌చార‌క్‌గా మారారు. 14 ఏళ్ల‌పాటు పూర్తిస్థాయి ప్ర‌చార‌క్‌గా ప‌ని చేశారు. దేశ‌విభ‌జ‌న అనంత‌రం ఖ‌ట్ట‌ర్ కుటుంబం పాకిస్థాన్ నుంచి మ‌న దేశానికి వ‌ల‌స వ‌చ్చి రోహ్‌త‌క్ జిల్లాలో స్థిర‌ప‌డింది.

Also Read:ప్రపంచ కార్టూనిస్ట్ డే..

1994లో బీజేపీలో చేరిన ఖట్టర్ అంచెలంచెలుగా ఎదిగారు. తొలిసారి 2014లో కర్నాల్ నియోజకవర్గం నుండి పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొంది సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత 2019లో రెండోసారి బీజేపీని అధికారంలోకి తేవడంలో సక్సెస్ అయ్యారు. బాలిక‌ల సంర‌క్ష‌ణ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ బేటీ బ‌చావో, బేటీ ప‌డావో కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కోసం నిరంత‌ర‌ కృషి చేశారు. ఖ‌ట్ట‌ర్ ప్ర‌భుత్వ కృషి వ‌ల్ల హ‌ర్యానాలో బాలిక‌ల లింగ నిష్ప‌త్తి గ‌ణ‌నీయంగా పెరిగింది.

Also Read:హ్యాపీ బర్త్ డే..కృష్ణ పూనియా

- Advertisement -