మధ్య యుగం ప్రపంచంను గడగడలాడించి…యూరోప్ కంటికి నిద్ర పట్టకుండా చేసిన వ్యక్తి నెపోలియన్. కత్తితో కిరీటాన్ని తన తలపై పెట్టుకున్న రాజుగా చరిత్రకారులు అభివర్ణిస్తున్నారు. ఆగస్టు 15,1769 నెపోలియన్ కోర్సికాలో జన్మించారు. ఆయన్నే మిలిటరీ అకడమీ నుండి పట్టబద్రుడయ్యారు.
బ్రిటీష్‌తో ఈజిప్ట్ యుద్దం తర్వాత నెపోలియన్‌లో ఒక రాజుగా వెలిగారు. దీంతో అతన్ని బ్రిగేడియర్ జనరల్‌గా నియమించబడ్డారు. అనతి కాలంలో నెపోలియన్ లూయీ వంశంను పారదొలి రాజ్యాధికారం చేపట్టారు. 1804లో ఫ్రాన్స్ చక్రవర్తిగా అయ్యారు. యూరోప్‌కు నిద్రలేని రోజులు నేర్పించిన వ్యక్తిగా నిలిచారు.
మధ్య యుగ చరిత్రలో యూరోప్‌ను పటాలను తిరిగి గీయించారు. అయితే చివరికి 1814 యుద్ధం ద్వారా ఓడిపోయి ఎల్బా అనే చిన్న ప్రాంతాన్నికి బహిష్కరించారు. అయితే ఇక్కడి నుంచి తప్పించుకొని మళ్లీ ప్రెంచి రాజయ్యారు. దీంతో మరోక సారి యూరోప్‌తో జూన్18, 1815 వాటర్లూ యుద్ధానికి దిగి ఓడిపోయారు. చివరికి మే5, 1821న నెపోలియన్ మరణించారు. ఈ యుద్ధంలో యూరోప్ ఒక వైపు మరొకవైపు నెపోలియన్ నిలిచి ఓడిపోయారు.