అది 1510 బీజాపూర్ సుల్తాన్‌కి పోర్చుగీస్ జనరల్ అల్ఫోన్స్‌డీ అల్బుకెర్కీ భారతదేశంలోని ఒక చిన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానిని సంస్కృతంలో గోమంతక్ అని పిలుస్తారు. అలాగే గోవే, గోవాపురి అనేవి అక్కడ ఉన్న ప్రధాన ఓడరేవులు. అయితే కాల క్రమంలో గోవాగా మారింది. ఇక అప్పటి నుంచి అనేకమంది చేతులు మారుతూ చివరికి పోర్చుగీసు వారి చేతికి వచ్చింది.
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన గోవా మాత్రం విదేశీయుల కబంధ హస్తాలో నలిగిపోతుంది. 1961లో అప్పటి ప్రధాని నెహ్రూ భారత సైన్యంను రంగంలోకి దింపి ఆపరేషన్ విజయ్‌ను విజయవంతంగా ముగించారు. గోవాతో పాటుగా డామన్ మరియు డయ్యూలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సుమారు 400సంవత్సరాల పాటు విదేశీయుల చేతిలో నలిగిపోయిన గోవా…1961లో విముక్తి పొంది…జనగణమనను ఆలపించారు.
1962లో దయానంద్ భండార్కర్ గోవా మొదటి సీఎం అయ్యారు. 1987 మే 30న గోవాకు రాష్ట్ర హోదా దక్కింది. నేడు గోవా రాష్ట్ర హోదాను సాధించి 36వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. గోవాలో వలసవాద విముక్తి కోసం పోరాడిన వ్యక్తి టీబీ కున్హా. ఈయన వలసవాదానికి వ్యతిరేకంగా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఫారిన్ రూల్ మరియు ది డినేషనలైజేషన్ ఆఫ్ గోవాన్స్ అనే పుస్తకంను ప్రచురించారు. అందుకే ఆయన్ని 1946లో ఆరెస్ట్ చేశారు. ఈయన్ని ఫ్రీగోవా అనే వార్తా పత్రికను ప్రచురించారు.
Also Read: NDA:భారత్ మా తుజే సలామ్ పాట విడుదల
రామ్ మనోహర్ లోహియా అనే మరొక ఫ్రీడమ్ ఫైటర్ 1950ల కాలంలో పోర్చుగీసుకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమానికి నాయకత్వం వహించారు. అలాగే 1954లో గోవా విమోచన్ సహాయక్ సమితిని ఏర్పాటు చేశారు. ఈయన అనేక పలుమార్లు పోర్చుగీసు ఆదేశాలను ధిక్కరించిన స్వాతంత్ర్య సమరయోధుడు.
Also Read: ఆర్చరీలో సత్తా చాటిన టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు