MAY22:ఎయిరిండియా చరిత్రలో చీకటి రోజు

38
- Advertisement -

మే 22న దుబాయ్‌ నుండి మంగళూర్‌కు చేరుకున్న విమానం రన్‌వే కోసం ఎదురుచూసింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ నుంచి గో అరౌండ్‌కు మూడు సార్లు పిలుపు వచ్చినప్పటికి కెప్టెన్ యొక్క అస్థిరమైన విధానాన్ని కొనసాగించాడు. దాంతో ఒక్కసారిగా కొండల్లోకి వెళ్లి మంటలు చెలరేగాయి. ఇది జరిగి మే22, 2010న మంగుళూర్‌లో జరిగింది. మరియు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన మొదటి సంఘటన. ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడ్డది.

బోయింగ్‌ 737-800ప్యాసింజర్‌ సిరీస్ కలిగిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 812ను నడుపుతున్నది కెప్టెన్ జ్లాట్కో గ్లుసికా, ఫస్ట్‌ ఆఫీసర్‌ హర్బీందర్ సింగ్‌ అహ్లువాలియా అలాగే నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. వీరు 10వేల గంటలకు ఫ్లైయింగ్‌ అనుభవం కలిగిన ఆఫీసర్స్‌. భారత్‌లో క్రిటికల్ ఎయిర్‌ఫీల్డ్‌ కలిగిన ఏడు భారతీయ విమానాశ్రయాల్లో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. దీన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ ధృవికరించింది. అయితే ఈ దుర్ఘటనలో పైలట్‌కు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు మధ్య ఎటువంటి సంభాషణలు బాధను చూపించలేకపోయింది. కానీ టెలివిజన్ ఫుటేజీ మాత్రం చూపించింది. అది మంటల్లో కాలిపోతున్న విమానం అందులోని సిబ్బంది అలాగే ప్రయాణికులు.

అప్పటి యూపీఏ-2 హాయాంలోని ప్రపుల్ పటేల్ దీనిపై స్పందిస్తూ వాతావరణ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, గాలి పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని, ప్రమాదం జరిగిన సమయంలో వర్షం పడలేదని చెప్పారు. ఇంత ఘోరమైన దుర్ఘటనలో 160మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బందిలో 158 మంది  (అందరూ సిబ్బంది,152మంది ప్రయాణికులు) మరణించారు. బోయింగ్‌ 737-800ప్యాసింజర్‌ సిరీస్ కలిగిన విమానాలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దుర్ఘటనలు సంభవించాయి. కానీ ఏ ఒక్క దేశం ఈ సిరీస్‌ విమానాలపై బోయింగ్ సంస్థపై కఠీనమైన చర్యలు తీసుకోలేకపోతున్నాయి.

Also Read: Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -