కుంజున్ని మాష్..మలయాళ పిల్లల కవి

58
- Advertisement -

పిల్లలకు ఆటవిడుపుగా పొడుపుకథలు చెప్పడం ఆటలు ఆడించడం పుస్తకాలు చదివించడం లాంటి పనులు వల్ల పిల్లల్లో మానసిక ఉత్సాహం పెరుగుతుంది. అలాగే జీవితంలో తను అనుకున్నది సాధించాలంటే మానసికంగా సిద్ధంగా ఉంటారు. అలాంటి వాటిలో పిల్లల కోసం ప్రత్యేకమైన బొమ్మల పుస్తకాలు కథల పుస్తకాలు ఉండటం ఆరుదు. కానీ మలయాళి కవి కుంజున్ని మాష్ మాత్రం పిల్లలకు అర్థమయ్యేలా తన పుస్తకాలు ఉంటాయి.ఇతన్ని పిల్లల కవిగా ప్రసిద్ధిగాంచారు.

ఈయన మే10, 1927న కేరళలోని త్రీసూర్‌లో వలపాడ్ గ్రామంలో జన్మించారు. కుంజున్ని చెలారి పాఠశాలలో ఉపాధ్యాయునిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తదనంతరం 1953లో రామకృష్ణ మిషన్ సేవాశ్రమ ఉన్నత పాఠశాలలో పనిచేశారు. ఈయన పిల్లకు సంబంధించి అనేక పుస్తకాలు రచించారు. వారపత్రిక పిల్లల కాలమ్‌లో కుంజున్ని కుట్టెట్టన్ అనే మారుపేరుతో రాశారు. ఈయన పుస్తకాలే కాకుండా చిత్రసీమలో అడుగుపెట్టారు. కుంజున్ని మాష్ జీవితాన్ని ఒరిదత్తు ఒరిదతు ఒరు కుంజున్ని మాష్‌ సిప్పీ పల్లిపురం అనే కవి రాశారు.

Also Read: చర్మ సమస్యలకు ఇంటి వైద్యం..

1977లో అక్షర తెట్టు అనే సాహిత్యానికి కేరళ సాహిత్య అకాడమీ అనే వార్షిక బాల సాహిత్య పురస్కారం దక్కింది. 1982లో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ చిల్ర్డన్స్ లిటిరేచర్ అవార్డు దక్కింది. 2002లో స్టేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ చిల్ర్డన్స్‌ లిటిరేచర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. 2003లో వీఏ కేశవన్ నాయర్ అవార్డు టోమ్యాస్ అవార్డును అందుకున్నారు. ఈయన్న 2006 మార్చి 26న మరణించారు.

Also Read: యూకేలో కేసీఆర్ కృతజ్ఞత సభ

- Advertisement -