యూకేలో కేసీఆర్ కృతజ్ఞత సభ

49
- Advertisement -

అంబెడ్కర్ యూకే సంస్థ & ప్రవాస భారతీయ సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అంబెడ్కర్ గారి కీర్తి ప్రపంచానికి చాటి చెప్పేలా 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం, తెలంగాణ సచివాలయానికి అంబెడ్కర్ పేరు పెట్టడం, సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితుల ఉద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం తీసుకొచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కెసిఆర్ గారిని అభినందిస్తూ యూకే పార్లమెంట్ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన ” కెసిఆర్ కృతజ్ఞత సభ” కు యూకే ఎంపీలు వీరేంద్ర శర్మ , నవేదు మిశ్ర,బారోన్ కుల్దీప్ సింగ్ సహోట, తెలంగాణ ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం, మాజీ ఎమ్మెల్సీకి కర్నె ప్రభాకర్ మరియు స్థానికి ప్రవాస సంఘాల నాయకులు హాజరయ్యారు.

సమన్వయకర్త సిక్కా చంద్రశేఖర్ అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమంలో ముందుగా అంబెడ్కర్ చిత్ర పటానికి పూలతో నివాళులులర్పించారు.అంబెడ్కర్ విగ్రహ ఆవిష్కరణ, సచివాలయ ప్రారంభ వేడుక మరియు దళిత బంధు పథకం అలాగే దళిత బందు విజయాలతో కూడిన వీడియోలను హాజరైన అతిధులకు ప్రదర్శించి వివరించారు.ఎంపీలు మాట్లాడుతూ అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసిన గొప్ప సంఘసంస్కర్త అంబేద్కర్ గారని, దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిదని తెలిపారు.

నేడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటు మాత్రమే కాకుండా వారి ఆశయాలకు అనుగుణంగా దళితుల సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని అమలు చేసిన తీరు ఎంతో స్ఫూర్తిగా ఉందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా దళితుల ఆర్థికంగా బలపడడమే కాకుండా సమాజం లో సముచిత గౌరవాన్ని పొంది అసమానతలు తొలిగిపోతాయని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని అభినందించారు. ఇలాంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేపడ్తు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రసంశించారు.

మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మొట్ట మొదటి సారి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం చాలా గర్వంగా ఉందని. వారి కీర్తిని ఆకాశమంత ఎత్తుకి తీసుకెళ్లడమే కాకుండా దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని అమలు చేసి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా సొంత వ్యాపారాలు పెట్టుకొని వారే పది మందికి ఉపాధి కలిగించే విధంగా తీర్చిదిద్ది ఆత్మగౌరవంతో బతుకుతున్న విధానం గొప్ప అనిపించిందని.ఒక దళిత పక్షపాతిగా పనిచేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రికి అంబేద్కర్ ఫెడరేషన్ పక్షాన అభినందించి కృతఙతలు తెలుపుతున్నామని, తెలంగాణ స్పూర్తితో దేశంలోని దళితుల సంక్షేమం పట్ల ఆయా ప్రభుత్వాలు కృషి చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:ఆ దర్శకుడికి యాంకర్ శాపం

ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ప్రతీ నిర్ణయం చారిత్రాత్మకమని, నేడు కెసిఆర్ గారి పాలన పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, ఇప్పటికే రైతు బంధు పథకాన్ని ఐక్య రాజ్య సమితి గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు.ఇప్పటివరకు ప్రతీ రాజకీయ పార్టీ దళితులని ఓటు బ్యాంకు లాగ మాత్రమే చూసారని, మొట్టమొదటి సారి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో వారి జీవితాల్లో మార్పు లభించిందని, దళిత బంధు ద్వారా దళిత జీవితాలు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారాయని, నేడు ఆర్థికంగానే కాకుండా సామాజికంగా ఎంతో గౌరవాన్ని గుర్తింపుని పొందారని తెలిపారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో మొదలైన దళిత బంధు ఎన్ని విజయాలు సాధించిందో ప్రత్యక్షంగా వెళ్లి చూశానని కొన్ని అంశాలని సభకు వివరించారు.అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాదు కెసిఆర్ గారు వారి ఆశయాలకు అనుగుణంగా పరిపాల చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా అణిచివేతకు గురయ్యిన దళిత సమాజానికి ఒక అభినవ అంబేద్కర్ గా దళిత పక్షపాతిగా పని చేస్తున్నారని తెలిపారు.

ఇప్పుడున్న పరిస్థితిలో దేశంలోని దళిత సమాజానికి న్యాయం జరగాలంటే తెలంగాణ మాదిరిగా దళిత బంధు లాంటి పథకాలు అమలు కావాలంటే కెసిఆర్ నాయత్వం తోనే సాధ్యమని, దేశ ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించాలని కోరారు.కర్నె ప్రభాకర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శమైందని ముఖ్యంగా అంబేద్కర్ గారిని గౌరవించుకోడమే కాకుండా నేడు దళితులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు వారికి రాజకీయంగా సముచిత స్థానం కలిపించారు, అలాగే వారు ఆర్థికంగా ఎదగాలని దళిత బంధు ద్వారా ఎన్నో దళిత కుటుంబాల్లో వెలుగు నింపారని తెలిపారు.కెసిఆర్ గారి నాయకత్వాన్ని నేడు దేశ ప్రజలు కోరుకుంటున్నారని, తెలంగాణ మోడల్ నేడు దేశానికి రోల్ మాడల్ అయ్యిందని తెలిపారు.

Also Read:Raj Tharun:హ్యాపీ బర్త్ డే

ఈ కార్యక్రమంలో వివిధ ప్రవాస సంస్థల ప్రతినిధులతో పాటు దళిత్ యూకే నెట్వర్క్ డైరెక్టర్ గజాల షేఖ్, అంబేద్కర్ యూకే సంస్థ ప్రతినిధి సుశాంత్ ఇంద్రజిత్ సింగ్, ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి,ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, టీ. డీ. ఎఫ్ చైర్మన్ కమల్ ఓరుగంటి, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, ఉదయ్ ఆరేటి, కన్సర్వేటివ్ నాయకుడు హరి, శ్రీమతి లోకమాన్య, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

- Advertisement -