కే‌సి‌ఆర్ ఎఫెక్ట్.. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ !

61
- Advertisement -

తెలంగాణలో సి‌ఎం కే‌సి‌ఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు బంధు, రైతు భీమా, 24 ఉచిత కరెంట్ వంటి ఎన్నో విప్లవాత్మక పథకాలను కే‌సి‌ఆర్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. దీంతో కే‌సి‌ఆర్ కు జాతీయ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. వారి వారి రాష్ట్రాలలో కూడా తెలంగాణ మోడల్ కోరుకుంటూ బి‌ఆర్‌ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారు. దీనికి మంచి ఉదాహరణ మహారాష్ట్రలో జరుగుతున్నా తాజా పరిణామాలే.. ఆ రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్ స్థానిక పార్టీలకు కూడా షాక్ ఇచ్చేలా బలం పెంచుకుంటుంది.

మహారాష్ట్రలో బి‌ఆర్‌ఎస్ కు లభిస్తున్న ప్రజా మద్దతును చూసి ఇతర పార్టీల నేతలు చాలామంది బి‌ఆర్‌ఎస్ చెంతకు చేరుతున్నారు. ఇకపోతే మహారాష్ట్రలో కూడా తెలంగాణ మోడల్ కోరుకుంటూ ఇక్కడ కూడా రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత కరెంటు వంటివి అమలు చేయాలని సామాజికవేత్త వినాయక్ రవ్ పాటిల్ గత కొన్నాళ్లుగా షిండే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దీనిపై చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో వినాయక్ లాల్ పాటిల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ మోడల్ మహారాష్ట్రలో కూడా కచ్చితంగా అమలు కావాలని.. అప్పుడే రాష్ట్రం రైతు రాజ్యంగా ఉంటుందని ఆయన డిమాండ్ ను వినిపించారు.

Also Read: KTR: ప్ర‌తిప‌క్షాల మాట‌ల‌కు ఆగం కావొద్దు

ముఖ్యమంత్రి షిండే ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బి‌ఆర్‌ఎస్ అధినేత తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ రంగంలోకి దిగారు. వినాయక్ రావ్ పాటిల్ చేపట్టిన దీక్షకు బి‌ఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు మద్దతు తెలుపుతూ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కడం, మాజీ ఎమ్మెల్యే శంకర్ దొడ్గే వంటి వారిని రావ్ పాటిల్ పక్షాన నిలిపారు కే‌సి‌ఆర్. దీంతో లాల్ పాటిల్ చేపట్టిన దీక్ష ఉదృతం అవుతుండడంతో షిండే ప్రభుత్వం దిగివచ్చి రావ్ పాటిల్ ను చర్చలకు ఆహ్వానించింది. దాదాపు 14 మంది రైతులతో సమావేశం అయిన షిండే.. రైతులు డిమాండ్ చేస్తున్న, రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత కరెంట్, 65 ఏండ్లు దాటిన రైతులకు పెన్షన్ వంటి అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా వేస్తున్నట్లు షిండే సర్కార్ ప్రకటించింది. మొత్తానికి తెలంగాణ మోడల్ మహారాష్ట్రలో కూడా అమలయ్యేందుకు తొలి అడుగు పడినట్లైంది.

Also Read: కర్ణాటక పోల్స్‌..ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్

- Advertisement -