- Advertisement -
ఐపీఎల్ అంటేనే ఓ ఫీవర్. ఎంటర్ టైన్‌మెంట్‌తో పాటు ఫిక్సింగ్ కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపుతోంది.
మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని తనను కొంతమంది సంప్రదించారంటూ ఓ క్రికెటర్ బీబీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ)కు ఫిర్యాదు చేశాడు.. వెంటనే రంగంలోకి దిగిన ఏసీయూ విచారణ మొదలుపెట్టింది.
ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్టు ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ తెలిపారు. ఆటగాడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని సంప్రదించిన వారిని పట్టుకునే పనిలో ఉన్నామని వెల్లడించారు. వాస్తవానికి బయో సెక్యూర్ ఎన్విరాన్‌మెంట్‌లో ఉన్న ప్లేయర్లను అజ్ఞాత వ్యక్తులు నేరుగా కలవడం దాదాపు అసాధ్యం. అయితే బుకీ ఆ ఆటగాడిని ఎలా సంప్రదించాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -