బాలీవుడ్‌లో మరో విషాదం..

189
misty

బాలీవుడ్‌లో మరో విషదం నెలకొంది. ఐటెం సాంగ్స్‌తో అలరించిన మిష్టీ ముఖర్జీ(27) కన్నుమూశారు. కొద్ది కాలంగా కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆమె ఇవాళ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె మృతి పట్ల బాలీవుడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

2012లో వ‌చ్చిన లైఫ్ కి తో ల‌గ్ గ‌యి అనే సినిమాతో కెరియ‌ర్ ప్రారంభించింది మిష్టీ. రజనీష్ దుగ్గల్ తో కలిసి గోవింద ఆలే రే అనే డ్యాన్స్ నెంబర్ చేసింది. మిష్టీ మ్యూజిక్ వీడియోలతో పాటు బెంగాలీ సినిమాల‌లోను ప‌ని చేసింది. 2014లో ఆమె సెక్స్ రాకెట్ నడిపారనే ఆరోపణలతో వార్త‌ల‌లోకి ఎక్కింది.