సీఎం కేసీఆర్ బర్త్‌ డే…ప్రత్యేక పూజలు చేసిన మారెడ్డి

156
mareddy srinivas reddy
- Advertisement -

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు 67వ జన్మదినం సందర్భంగా పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో రాష్ట్రంలో 15 ప్రధాన దేవాలయాల్లో రైస్ మిల్లర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి రైస్ మిల్లుల అవరణలో చెట్లను నాటారు. బాసరలో సరస్వతీదేవి, ఏడుపాయలలో వనదుర్గాభవాని, నాచారంలో లక్ష్మినర్సింహస్వామి, జహీరాబాద్లో శివాలయం, వికారాబాద్లో అనంతపద్మనాభస్వామి, వేములవాడలో రాజరాజేశ్వరస్వామి, జూబ్లిహిల్స్ లో వెంకటేశ్వరస్వామి, గద్వాలలో జోగులాంబ, వరంగల్ లో భద్రకాళీ, యాదాద్రిలో లక్ష్మినర్సింహస్వామి, కురవిలో వీరభద్రస్వామి, కొమురవెల్లిలో మల్లన్నస్వామి, మిట్టపల్లిలో లక్ష్మినర్సింహస్వామి, భద్రాచలంలో శ్రీరాములవారు,కాళేశ్వరంలో ముక్తేశ్వరస్వామి దేవాలయాలల్లో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, డివిజన్, మండల కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు జి. నాగేందర్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లాలో లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కలు నాటారు.అలాగే రేషన్ డీలర్లు స్వచ్చందంగా ప్రతి గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చెట్లను నాటి పండ్లను పంపిణీ చేశారు.

పౌరసరఫరాల భవన్ లో గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు గారి 67వ జన్మదినోత్సవం సందర్భంగా యంపీ శ్రీ జోగినిపల్లి సంతోష్ గారు మొదలుపెట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమంలో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, పౌరసరఫరాల సంస్థ స్టేక్ హోల్డర్స్ రైస్ మిల్లర్లు, రేషన్ డీలర్లు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.హైదరాబాద్లోని పౌరసరఫరాలభవన్ ఆవరణలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీ. వి. అనిల్ కుమార్, ఇతర అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ పర్యావరణంపై ముఖ్యమంత్రిగారికి ఉన్న మమకారాన్ని దృష్టిలో ఉంచుకొని పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్లు నాగేంద్ర రెడ్డి, రాజారెడ్డి, శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -