మొక్కలు నాటిన సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి..

845
green challenge

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించారు సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి.

సిద్దిపేట సుడా కార్యాలయంలో మొక్కలు నాటారు రవీందర్ రెడ్డి. ఈ సందర్భంగా మరో ఇద్దరికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నలుమూలల విస్తరిస్తోందన్నారు.

green challenge

ఈ కార్యక్రమం లో సిద్దిపేట అర్బన్ ఎంపీపీ వంగ సవిత ప్రవీణ్ రెడ్డి ,హార్టికల్చర్ అధికారి భాస్కర్ రెడ్డి, సుడా ఆఫీసర్ ప్రవీణ్, సుడా గ్రామాల సర్పంచ్ లు & ఎంపీటీసీలు, సుడా కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొనగా సీపీవో శ్రీమన్నారాయణ, సుడా వైస్ చైర్మన్ (మున్సిపల్ కమిషనర్ ) శ్రీనివాస్ రెడ్డికి గ్రీన్ ఛాలెంజ్‌ని విసిరారు.

SUDA Chairman mareddy ravinder reddy accepts green challenge…SUDA Chairman mareddy ravinder reddy accepts green challenge…