శ్రీశైలం జలాశయానికి పొంచిఉన్న ప్రమాదం..

715
Srisailam

శ్రీశైలం డ్యామ్‌కు పెను ముప్పు ముంచుకొస్తుంది. డ్యాం ముందు భాగంలో 100 అడుగుల భారి గోయ్యి పడింది పట్టించుకోవాలసిన అధికారులు సర్వేలకే పరిమితమయ్యారు డ్యామ్ సేప్టి కమిటి పలుమార్లు పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. గత ఐదేండ్ల క్రిందటే డ్యాం ముందర భాగంలో 90 అడుగుల భారీ గోయ్యి పడిందని నేషనల్ ఒషనోగ్రాఫీ సంస్ద అధికారులకు తేల్చి చెప్పింది. అయితే 2009లో వచ్చిన వరదల దేబ్బకు డ్యామ్ ముందరభాగంలో పడ్డ గొయ్యి డ్యాం బెష్ మట్టం దిశగా పెరిగుతుందనే అనుమానాలు లేకపోలేదు. అదే జరిగితే జలవిలయం తప్పదన్నమాటే.

ఆంధ్రా.. తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు సాగు.. త్రాగు నీరందించే శ్రీశైలం జలాశయానికి ఇప్పుడు పెను ముప్పు పొంచి ఉంది డ్యాం బద్రతను పట్టించుకోవాలసిన అధికారులు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు 2009లో అకాల వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో భారీగా శ్రీశైలం జలాశయానికి వరదనీరు రావటంతో డ్యాం అధికారులు జలాశయానికి ఉన్న12 రేడియల్ క్రష్ట్ గేట్లను ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. ఆ సమయంలో క్రిష్ణమ్మ ఉగ్రరూపానికి డ్యాం గేట్ల ద్వారా ఎగిసి వడుతు దిగువకు జారిపడే వరద నీటి తాకిడికి డ్యాం ముందు భాగంలో ఉన్న ప్రదేశం వరద నీటి వరవడిని తట్టుకోలేక సుమారు 100 అడుగుల భారీ గోయ్యి పడింది. ప్రమాదం ముంచుకొస్తుందేమోనని అధికారులు 2012లో హడావిడిగా డ్యాం సేప్టి నిపుణుల కమిటిలు పలుమార్లు పరిశీలించి అదికారులకు సూచించారు. భారీ గొయ్యి పడిన ప్రదేశం అంతట నిపుణులతో అండర్ వాటర్ వీడిగ్రాపికల్ సర్వే కూడ చేయించారు. అయినప్పటికీ అప్పటినుంచి ఇప్పటి వరకు ఎటికేడాది నీటిలో సర్వేలు చేస్తున్నారే తప్ప పరిస్కారానికి ముందడుగు వేయలేకపొతున్నారు అధికారులు.

లక్షల ఎకరాల భూములకు సాగు నీరందించింది శ్రీశైలం జలాశయం. ప్రజల దాహర్తిని తీర్చేందుకు త్రాగు నీరందంచటంలో ఈ జలాశయం కీలక పాత్ర పోసించింది. అంతటి ఈ జలాశయాన్ని అధికారులు గాలికోదిలేశారనే విమర్శలున్నాయి. అంద్రప్రదేశ్, తెలాంగాణ రాష్ట్రప్రజలకు విద్యుత్ కేంద్రాల ద్వార విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ప్రజలను చీకటి నుంచి విముక్తి చేసి విద్యుత్ కాంతులతో విరాజిల్లుతూ ప్రజల దాహర్తిని తీరుస్తూన్న శ్రీశైలం జలాశయానికి ఇప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Srisailam dam1963 వ సంవత్సరంలో మల్లన్న పాదాలవద్ద ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానదిపై శ్రీశైలం డ్యాం నిర్మాణానికి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పూనాది వేశారు. అంధకారంలో కోట్టుమిట్టాడుతున్న పల్లె ప్రాంతాలను వెలుగులు నింపాలనే లక్ష్యంతో, లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చి సస్యశ్యామలం చేయాలన్న నాటి నేతల దృడ సంకల్పంతో ఈ శ్రీశైలం డ్యాం 885 అడుగులుగాను 308 టీయంసిల గరష్టస్దాయి నీటి నిల్వల సామార్ద్యంగాను రూపుదిద్దుకుంది. అయితే అప్పటి నుంచి ప్రతి వర్షాకాలం మాసంలో మరియు అకాశంలో వాతావరణ మార్పుల కారణంగా అకాల భారీ వర్షాలు కురవటంతో ఎగువ పరీవాహక ప్రాంతాలైన కర్ణాటక మహరాష్ట అల్మట్టి నారాయణపూర్ జూరాల తదితర ప్రాజెక్టుల నుంచి వరద నీరు శ్రీశైలం జలాశయాని బారిగా వచ్చి చేరుతుంది అదే సమయంలో శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయిలో నిండుతుంది దీంతో జలాశయంలోని 12 రెడియల్ క్రష్టు గేట్ల ద్వార వరద ఉదృతిని బట్టి నీటిని దిగువ నాగార్జునసాగర్ కు రెడియల్ క్రష్టు గెట్ల ద్వార నీటిని విడుదల చేస్తారు.

అదే సమయంలో జలాశయం ముందుభాగాన (స్పిల్ వే) క్రష్ట్ గెట్ల నుంచి నీళ్లు క్రిందికి ధార కట్టి దూకే దృశ్యాన్ని చూస్తుంటే ఇట్టే అర్దమౌతుంది. డ్యామ్ స్పిల్ వే దిగువ భాగనా క్రస్ట్ గేట్ల నుంచి వరద నీరు ఎగిసి పడే ప్రాంతం ( ప్లంజ్ పూల్ )లో భారి గోయ్యి ఏర్ఫడింది. దీని లోతు ఎడాదికేడాది గోయ్యి పెరుగుతూ ఇప్పటివరకు సుమారు 300 అడుగుల దాక ఉండొచ్చని అధికార వర్గాల అంచనా. ఆ గోయ్యి డ్యాం దిశగా పెరిగి ఉంటే… పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే అనుమానాలు లేకపోలేదు. అది భవిష్యత్తులో డ్యామ్ కే ప్రమాదకరంగా పరిణమించే ముప్పు ఉందని గతంలోనే నిపుణులు హెచ్చరించిన సందర్బాలు కూడ లేకపోలేదు.

ఈ జలాశయంలోని నీటిని పూర్తిస్దాయిలో వినియోగించుకోవాలనే సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి.. రాష్ట ప్రజలు అందకారంలో ఉండకుడదనే అభిప్రాయంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఈ జల విద్యుత్ కేంద్రంలో 7 జనరెటర్లను అమర్చారు ఇందులో ఒక్కోక్క జనరేటర్ 110 మెగావాట్ల విద్యుత్ ను జలాశయంలోని నీటిని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా ఏడమగట్టులోను భూగర్బ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మంచారు. ఇందులో 150 మెగావాట్ల సామార్దయం గల 6 జనరేటర్లను అమర్చారు కోట్లాది రూపాయలు కర్చు పెట్టి నిర్మించిన ఈ విద్యత్ కేంద్రాలకు ఇప్పుడు నీటి గండం ఉందనే చేప్ప వచ్చు. జలాశయం ముందుభాగాన ఏర్పడ్డ భారీ గోయ్యి అది కాస్తా.. నీటి అడుగు భాగంలో నుంచి కోతకు గురై నేమ్మది నేమ్మదిగా ముందుకు సాగిందంటే రెండు జల విద్యుత్ కేంద్రాలకు భారి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కోందరి ఇంజనీర్ల అభిప్రాయం.

శ్రీశైలం డ్యాం ముందు భాగంలో పడిన గొయ్యి కి అదికారులు 2011లో గోవాలోని నేషనల్ ఓషనోగ్రాఫీ సంస్దకు చెందిన శాస్త్రజ్ణులను నీటిపారుదల శాఖ పిలిపించింది. గొయ్యి పడిందనే సమాచారం తెలుసుకున్న అదికారులు ఉరుకులు పరుగులతో స్పందిచారు. కాని డ్యాం దిగువన ఎర్పడిన ఆ భారి గొయ్యి లోతును తెలుసుకునేందుకు నిపుణులు శ్రీశైలం డ్యామ్ వద్దకు చేరుకున్నారు. మరుసటి నాటి నుంచి గొయ్యి లోతును తెలుసుకునేందుకు తమ పరిశోధనను చేశారు. దాదాపు వారం రోజుల వరకు ఈ పరిశోధన జరుగింది. గొయ్యి లోతును ఆనకట్టకు ప్రమాదం లేకుండా చేయటానికి తీసుకోవాలసిన రక్షణ చర్యలపై వారు నీటిపారుదల శాఖకు నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం నీటిపారుదల శాఖ తదుపరి చర్యలును చేపట్టాలి. కానీ ఇంత వకరకు ఆదిశగా అధికారులు ప్రయత్నించలేదు. ప్లంజ్ పూల్ గొయ్యిని అధ్యాయనం చేసిన నిపుణులు అత్యంతాధునికమైన కెమెరాలతో నీళ్లులో లోపలికి వెళ్లి ( అండర్ వాటర్ )డ్యాం అడుగు భాగాన్ని చిత్రీకరించటంతో పాటు గొయ్యి లోతును. వైశాల్యాన్ని చిత్రీకరిస్తూ ప్రతి కీలక అంశాన్ని పరిశోధన చేశారు.

ప్లంజ్ పూల్ ముప్పును ఆరేళ్ల క్రీతమే గుర్తించిన నిపుణులు డ్యాంకు ఎలాంటి నష్టం సంభవించకుండా.. కాంక్రీట్ తో నింపిన ఐరన్ సిలిండర్లను ( దిమ్మెలు ) ఆ గోతిలో నిర్మించాలని అదికారులకు సూచించారు. 2004 నుంచి వరుసగా వరద సీజన్‌లో డ్యాం రెడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తడం స్పిల్ వే ద్యార వరదనీటిని విడుదల చేస్తున్నారు. ఆ సందర్బంలో ప్లంజ్ పూల్ లోతు ఏటికేడాదికి పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ ప్లంజ్ పూల్ ఉన్న ప్రాంతంలో సుమారు ఒకటిన్నర టీయంసీ నీరు నిల్వ ఉన్నట్లుగా తెలుస్తోంది. 2009 అక్టోబర్‌లో కృష్ణానది వరదలు ప్రమాదకర స్దాయికి చేరటంతో… 20 రోజులపాటు స్పిల్ వే ద్వార ఏక దాటిగా 20-24 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్ కు విడుదల చేశారు. ఈక్రమంలో ప్లంజ్ పూల్ గొయ్యి లోతు మరింత పెరిగినట్లుగా బావిస్తున్నారు. నిజానికి నీటిపారుదల శాఖ అధికారులు 2009లో వరదలకు ముందు, ప్లంజ్ పూల్ లోతుపై వీడియో గ్రాఫీకల్ సర్వే జరిపి ఉన్నతాధికారులకు నివేదించారు. దాని ప్రకారం.. నీటిపారుదల శాఖకు చేందిన రాష్ట్ర స్దాయి డ్యాం సెఫ్టి కమిటీ శ్రీశైలం వచ్చి ప్లంజ్ పూల్ ను పరిశీలించింది. వీలైనంత త్వరగా ఆ గొయ్యిని పూడ్చాలని అధికారులకు నివేదిక సమర్పించింది. ఏది ఏమైనప్పటికి శ్రీశైలం జలాశయం ముందు భాగాన పడిన భారి గొయ్యి వలన అటు డ్యామ్ కు ఇటు జలవిద్యుత్ కేంద్రాలకు మొప్పు తప్పదు. అదే జరిగితే భారి నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైన అధికారలు స్పందించి డ్యాం భద్రతపై దృష్టిపెట్టి శ్రీశైలం డ్యాం కుముప్పువాటిల్లకుండా చూడాలసిన భాద్యత అధికారులపై ఎంతైన ఉంది .

డ్యామ్ S.E చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. శ్రీశైల జలాశయని ఎటువంటి ముప్పు లేదు. నిపుణులు వచ్చి డ్యామ్ ను పరిశీలించి వెళ్లారు. డ్యామ్ ముందు ప్లంజ్ పూల్ ప్రమాదకరం కాదు. డ్యామ్ ను గోవా,విశాఖపట్నం నిపుణులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసాం. డ్యామ్ ప్రమాదం ఉంది అనేది అవాస్తవం అని చంద్రశేఖర్ రావు తెలిపారు.

Waterman of India and Magsaysay Award winner Rajendra Singh has said the Srisailam Dam needs repair, protection and maintenance works urgently..