మార్చి8..మహిళలకు సాధారణ సెలవు

18
- Advertisement -

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఈనెల 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళ ఉద్యోగులకు సాధారణ సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మ‌హిళా దినోత్స‌వం రోజున ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌టించ‌డంపై మ‌హిళా ఉద్యోగులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని రాష్ట్ర ప్ర‌భుత్వం పలు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని సెర్ప్‌ మెప్మా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసినట్టు రాష్ట్ర ఆర్థికాశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈమేరకు రూ.750కోట్ల రుణాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

మహిళా సంక్షేమమే తెలంగాణ లక్ష్యం..

మీ ఆతిథ్యం మరువలేనిది…ఫాక్స్‌కాన్‌

చిగురించే ఆశల నూతనత్వమే హోలీ…

- Advertisement -