ఆర్బీఐకి అభినంద‌నలు తెలిపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

212
- Advertisement -

కరోనా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ఎప్రిల్ 14 వర‌కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. దీంతో 21 రోజులు ప్ర‌జ‌లు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావోద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది ప్ర‌భుత్వం. దీంతో ప్ర‌జ‌ల‌కు నిత్యావ‌స‌రాలు పంపిణి చేస్తుంది ప్ర‌భుత్వం. లాక్ డౌన్ సంద‌ర్బంగా ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అన్నిరకాల రుణాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆర్‌బీఐ ప్రకటన చేసింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణ‌యం అభినంద‌నీయం అన్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆర్‌బీఐ తీసుకున్న‌ ఈ నిర్ణయం సన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు.కాగా దేశ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

- Advertisement -