మిస్‌ ఇండియా 2017.. మానుషి !

188
- Advertisement -

ప్రతి ఏడాది నిర్వహించే మిస్ ఇండియా పోటీల్లో మిస్‌ ఇండియా టైటిల్‌ను మానుషి ఛిల్లార్ గెలుచుకుంది. ఆదివారం రాత్రి యశ్‌రాజ్ స్టూడియోస్‌లో 54వ ఫెమినా మిస్ ఇండియా పోటీలు జరిగాయి. ఈ పోటీలకు మిస్‌ వరల్డ్‌ 2016 స్టిఫానీ డెల్‌ వాలే న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. మిస్‌ ఇండియా 2017గా మానుషి ఎంపిక కాగా.. తొలి రన్నరప్‌గా జమ్ముకశ్మీర్‌కు చెందిన సనా దువా, రెండో రన్నరప్‌గా బిహార్‌కు చెందిన ప్రియాంక కుమారి నిలిచారు.

miss india 2017

ఈ పోటీల్లో పలు రాష్ట్రాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. మిస్‌ ఇండియా తుదిపోటీల్లో తొలిసారిగా భారతీయ సంప్రదాయానికి చెందిన దుస్తులను ధరించారు. హరియాణాకు చెందిన మానుషి.. దిల్లీలోని సెయింట్‌ థామస్‌ స్కూల్లో చదివింది. మానుషి తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. తాను కూడా వైద్యవిద్యనే ఎంచుకుని సోనిపట్‌లోని భగత్‌పూల్‌సింగ్‌ గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలో సీటు సాధించింది. ఈ ఫలితాల అనంతరం మానుషి మాట్లాడుతూ ఒక విజన్‌తో తాను సాగించిన జర్నీ ఫలించిందని హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా దర్శక నిర్మాత కరణ్ జోహార్, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌, తదితరులు విచ్చేసి విజేతను ప్రకటించారు. ఈ వేడుకకు రితేష్ దేశ్‌ముఖ్, కరణ్ జోహర్లు హోస్టులుగా వ్యవహరించారు.

miss india 2017

- Advertisement -