ఓటీటీలోకి మాన్షన్ 24!

60
- Advertisement -

రాజు గారి గది సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని హారర్ కామెడీతో ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ ఈసారి మాన్షన్ 24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. హాట్ స్టార్స్ స్పెషల్స్ గా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. మాన్షన్ 24లో సత్యరాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్, అయ్యప్ప పి.శర్మ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఓ పాడుబడిన మాన్షన్ లో.. ఏ క్షణం ఎలాంటి మనుషులు ఎదురవురుతారో, ఏ నిమిషం ఏం జరుగుతుందో, ఎలాంటి గగుర్పొడిచే సన్నివేశాలు తారసపడతాయో తెలియని సస్పెన్స్ తో ఈ సిరీస్ తెరకెక్కింది.అంతుపట్టని మిస్టరీ ని, దాని వెనకాల వున్న ఒక భయంకరమైన నిజాన్ని ఛేదించడానికి ఒక అమ్మాయి చేసే ప్రయత్నం ఏంటనే దానిపై మాన్షన్ 24 తెరకెక్కగా ఇవాళ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఒక సరికొత్త నేపథ్యం, దాన్ని మ్యాచ్ చేసే కథాంశం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇవ్వనుంది.

Also Read:లియో..తెలుగు రెస్పాన్స్ అదుర్స్

- Advertisement -