దీదీ కేబినెట్‌లో మనోజ్ తివారీ..

415
tiwari
- Advertisement -

బెంగాల్‌లో బీజేపీని మట్టికరిపించి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. గతంలో కంటే సీట్ల సంఖ్యను పెంచుకోగా మరోసారి తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు మమతా.

ఇప్పటికే సీఎంగా మమతా ప్రమాణ స్వీకారం చేయగా తాజాగా సోమవారం మంత్రి వర్గం ఏర్పాటైంది. 43 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భారత మాజీ క్రికెటర్‌ మనోజ్ తివారీ….కేబినెట్‌లో ఛాన్స్ దక్కించుకున్నాడు. యువజన, క్రీడా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

ప్రమాణ స్వీకారం అనంతరం ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ ట్వీట్‌ చేశాడు తివారి. శివ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించాడు. భారత్‌ తరఫున 12 వన్డేలు, 3 టి20లు ఆడిన తివారి… 16 ఏళ్ల ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 50.36 సగటుతో 8965 పరుగులు చేశాడు. 2012లో ఐపీఎల్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో మనోజ్‌ తివారి కూడా సభ్యుడు.

- Advertisement -