చిన్న రైతులను ఆదుకోవాలి: ఎంపీ శ్రీనివాస్ రెడ్డి

501
Manne Srinivas Reddy
- Advertisement -

దేశవ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి.వ్యవసాయ ఉత్పత్తిదారుల వాణిజ్యం, వ్యాపారం బిల్లుపై లోక్ సభలో మాట్లాడిన ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి.,..కేంద్ర ప్రభుత్వం చిన్న రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతు బంధు పేరుతో గొప్ప పథకాన్ని అమలు చేస్తున్నారు.రైతాంగానికి ప్రతి ఏటా 10వేల రూపాయల పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది.వ్యవసాయ వాణిజ్యం లో అనేక మార్పులు రావాల్సి ఉంది.కేంద్ర ప్రభుత్వం ఎమ్ ఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలన్నారు.

- Advertisement -