ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఆపడం నేరం!

4
- Advertisement -

విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూ . ప్రజల మద్దతుతో అధికారంలోకి రావాలనుకుంటున్న ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం అన్నారు. విజయ్‌ను తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆశాకిరణంగా ఠాగూర్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పుకు విజయ్ ప్రతిరూపంగా నిలిచారని ఆయన కొనియాడారు. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా విజయ్ ప్రజల మన్ననలు పొందడాన్ని ఆయన అభినందించారు.

ప్రజలు తమ ఓటు ద్వారా ఇచ్చిన తీర్పును ఎవరూ అడ్డుకోలేరని, మెజారిటీ ఉన్న పక్షాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఆపడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి, అత్యధిక మద్దతు ఉన్న విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.

Also Read:Modi:యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అది చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని హెచ్చరించారు.ఇప్పటికే VCK మరియు CPI పార్టీలు విజయ్‌కు మద్దతు తెలపగా, ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ కూడా గళం కలపడం విజయ్ రాజకీయ బలాన్ని మరింత పెంచింది.

- Advertisement -