మణిరత్నంకు గుండెపోటు…

387
maniratnam
- Advertisement -

లెజండరీ డైరెక్టర్ మణిరత్నంకు గుండె పోటు వచ్చింది. సడెన్‌గా గుండెపోటు రావడంతో ఆయన్నీ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్ర అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఆయనకు ఇలా గుండెనొప్పి రావడం ఇది నాలుగోసారి. గతంలో 2004లో, 2015,2018వ సంవత్సరంలో  హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మరోమారు గుండెపోటు రావడంతో ఆయన్ను హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తెలుగులో ఈయన దర్శకత్వం వహించిన ఒకే ఒక సినిమా గీతాంజలి. కానీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అన్ని తమిళ చిత్రాలూ తెలుగులోకి అనువదించబడ్డాయి. నాయకుడు, రోజా, బొంబాయి, గీతాంజలి మొదలయినవి మణిరత్నం ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే. ఆయన ప్రతి చిత్రం విమర్శకుల ప్రశంశలు పొందింది. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితం అయిన ప్రముఖ హీరోయిన్‌ సుహాసిని మణిరత్నం భార్య.

- Advertisement -