Mangalavaram:‘మంగళవారం’ పరిస్థితి ఏమిటి ? 

81
- Advertisement -
బోల్డ్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన ‘మంగళవారం’ నేడు విడుదల కాగా, పాజిటివ్ టాక్ వస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా భారీ ధరకు సొంతం చేసుకుందని సమాచారం. ఇక ఈ మూవీని ఓటీటీలోకి థియేట్రికల్ రిలీజ్ తర్వాత 40 రోజులకు, లేదా డిసెంబర్ రెండో వారంలో తీసుకురానున్నారని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ ‘మంగళవారం’ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఒక మిస్టీక్ థ్రిల్ల‌ర్. మ‌ధ్యలో చిన్న హార‌ర్ ట‌చ్ ఇచ్చి.. ఆ త‌ర్వాత ఓ రివేంజ్ డ్రామాలా కొన‌సాగింది. గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న శైలు పాత్ర‌లో పాయ‌ల్ చ‌క్క‌గా ఒదిగిపోయింది. అజ‌నీష్ మ్యూజిక్, సెకండ్ హాఫ్ లో ట్విస్ట్‌లు బాగున్నాయి. నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం..క్లైమాక్స్ కుదరలేదు. అయితే, ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా బాగుండి ఉండి ఉంటే.. ఈ సినిమాకి బెటర్ ఓపెనింగ్స్ వచ్చి ఉండేవి.
కానీ, దర్శకుడు అజయ్ భూపతి పైత్యం కారణంగా సినిమా ఫలితం దెబ్బ తింది. కానీ పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్‌లో మాత్రం చాలా బాగా నటించింది. ఈ సినిమా కథ 1986-96 మధ్య కాలంలో సాగుతుంది. రెండు జంటలు మంగళవారం రోజే ఎందుకు చనిపోతాయి? వారి చావులకు పాయల్‌కు సంబంధమేంటి? అనేది ఈ సినిమా కథ. ఫస్టాప్ బాగుంది. కానీ సెకండాప్ లో నెరేషన్ స్లోగా సాగుతోంది. ఓవరల్‌గా మూవీ ఏవరేజ్ గా నిలుస్తోంది.
- Advertisement -