ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు హీరో మంచు మనోజ్. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలంలని… ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల పేర్లను కూడా తెలుగులోనే రాయాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో, కేసీఆర్ నిర్ణయం సర్వాత్ర హర్షం వ్యక్తమవుతుండగా…హీరో మంచు మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి నా అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు.
మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ #KCR గారికి నా అభినందనలు 🙏🙏🙏 pic.twitter.com/4azBLXVqmK
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 13, 2017
గతంలో కేసీఆర్‌పై మోహన్ బాబు సైతం ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ పాలనను, పట్టుదలను, విధి విధానాలను పొగిడిన మోహన్ బాబు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాదించినందుకు అభినందనలను కూడా తెలిపారు. చరిత్రలో గొప్ప గొప్ప ఉద్యమాలన్నీ గొప్ప వ్యక్తుల సంకల్పం వల్లే వస్తాయన్న మోహన్ బాబు…ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు.