మంచు మనోజ్ పెళ్ళికి జూ.ఎన్టీఆర్!

20
- Advertisement -

సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ హీరో మంచు మనోజ్, దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి రెండో కుమారై భూమా మౌనిక‌రెడ్డి వివాహం మార్చి 3న జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న మ‌నోజ్ సోద‌రి మంచు లక్ష్మి ఇంట్లో మెహందీ కార్యక్రమం జరిగింది. ఈ మెహందీ వేడుకలో మంచు మనోజ్ వైట్‌ షర్ట్‌ లో ఉన్న ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ వేడుకల్లో మోహన్ బాబు పాల్గొనలేదని తెలుస్తోంది.

మనోజ్, మౌనికా రెడ్డి ఇద్దరికీ ఇది రెండో వివాహం. ఈ వేడుకకు కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం. నిన్న మెహందీ వేడుకతో మనోజ్, మౌనికా రెడ్డి పెళ్లి సందడి మొదలైంది. మొత్తానికి రేపు మంచు మనోజ్ పెళ్లి అంటూ ప్రస్తుతం నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా మనోజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. మంచు ఫ్యామిలీలో ఫాలోయింగ్ ఉన్న హీరో మనోజ్. హీరోగా గ్యాప్ వచ్చినా.. మనోజ్ కి ఇప్పటికీ క్రేజ్ ఉంది.

పైగా మనోజ్ మంచి నటుడు కూడా, అలాగే మంచి మనిషి అని ఇండస్ట్రీలో మనోజ్ కి గుడ్ నేమ్ కూడా ఉంది. తాజాగా మనోజ్ మళ్లీ పర్సనల్ లైఫ్ లో సెటిల్ కాబోతున్నాడు. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. మనోజ్ కి కాలం కరుణించలేదు. అన్నీ ఉన్నా.. స్టార్ కాలేకపోయాడు. అయితే, పెళ్లి తర్వాత మనోజ్ మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నాడు. ఇప్పటికే ఆల్ రెడీ ఒక సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు. అన్నట్టు మనోజ్ పెళ్ళికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నాడు.

ఇవి కూడా చదవండి…

కృతి పాపకు మరో క్రేజీ ఆఫర్!

కిచ్చ సుదీప్‌కు సారీ చెప్పిన పవన్‌!

అనుష్క కొత్త సినిమా టైటిల్ ఇదే!

- Advertisement -