కిచ్చ సుదీప్‌కు సారీ చెప్పిన పవన్‌!

17
- Advertisement -

కన్నడ హీరోలు ఉపేంద్ర, కిచ్చ సుదీప్‌కు సారీ చెప్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కన్నడ మూవీ కబ్జా ఆడియో ఫంక్షన్‌కి పవన్‌ను అతిథిగా ఆహ్వానించారు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉండటం, ముందుగా షెడ్యూల్ ఖరారు కావడంతో ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు రాలేక పోతున్నాను క్షమించండి అని తెలిపారు పవన్.

హీరోలు ఉపేంద్ర, సుదీప్‌కు నా ప్రత్యేక శుభాకాంక్షలు. వారు వెరైటీ పాత్రలు పోషిస్తూ వివిధ భాషల్లో గుర్తింపు సాధించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్ చంద్రు ఈ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్‌ని సాధించాలి. నిర్మాత శ్రీరామ చంద్ర గౌడ, సంగీత దర్శకులు రవి బస్రూర్, ఇతర మూవీ టీంకి నా శుభాకాంక్షలు అని తెలిపారు పవన్.

ఈ సినిమాలో శ్రియా శరణ్ , పోసాని కృష్ణ మురళీ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 17న కన్నడంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -