అనుష్క కొత్త సినిమా టైటిల్ ఇదే!

20
- Advertisement -

అనుష్క ‘నిశ్శబ్దం’ తర్వాత కొంత బ్రేక్ తీసుకుంది. మూడేళ్ళ తర్వాత ఆమె నటిస్తున్న కొత్త సినిమా నుండి తాజాగా టైటిల్ పోస్టర్ వచ్చింది. నవీన్ పోలిశెట్టి తో అనుష్క నటిస్తున్న సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అంటూ టైటిల్ పెట్టారు. ఇద్దరి పేర్లలో ఉండే ముందు చివరి అక్షరాలతో టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. మహేష్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.

అనుష్క ఇందులో చెఫ్ పాత్రలో నటిస్తుంది. నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నాడు. ఇద్దరి పాత్రలకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్స్ వచ్చేశాయి. అమెరికాలో ఉండే అమ్మాయికి హైదరాబాద్ అబ్బాయి కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది ? అనే కాన్సెప్ట్ తో ఫన్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కుతుంది.

అనుష్క , నవీన్ జోడీ పై ఇప్పటికే కొన్ని సందేహాలున్నాయి. అసలు అనుష్క పక్కన ఈ కుర్ర హీరో సెట్ అవుతాడా ? అనే ప్రశ్నలకు టైటిల్ పోస్టర్ తో సమాధానం లభించింది. జోడీ పోస్టర్స్ లో ఆకట్టుకుంది. సినిమాలో ఈ జోడీ కి ఎన్ని మార్కులు పడతాయో చూడాలి.

ఇవి కూడా చదవండి…

పిక్ టాక్ : కృతి కర్బంద అందాల వెల్లువ!

పవన్ – సాయి తేజ్’ కి హీరోయిన్లు ఫిక్స్

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ ఖరారు

- Advertisement -