షాకింగ్‌: శవాలతో మంచు మనోజ్‌..!

412
manchu manoj
- Advertisement -

మూడేళ్ల గ్యాప్ తర్వాత తిరిగ మేకప్ వేసుకునేందుకు సిద్ధమయ్యాడు హీరో మంచు మనోజ్‌. 2017లో ఒక్కడు మిగిలాడు చిత్రంలో నటించిన మనోజ్ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొళ్తా కొట్టడంతో సినిమాలకు విరామం తీసుకున్నాడు.

తాజాగా మళ్లీ మేకప్ వేసుకునేందుకు సిద్ధమైన మనోజ్‌..ఈ సినిమాతో నిర్మాతగాను మారనున్నాడు. ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్ బ్యానర్‌పై మనోజ్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

మార్చి 6న సినిమా షూటింగ్ ప్రారంభంకానుండగా ఈ చిత్రానికి అహం బ్రహ్మాస్మి అనే టైటిల్‌ని ఖరారుచేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. మనోజ్ ఈ చిత్రంలో కొంత భాగం అఘోరాగా కనిపిస్తారట. శవాలను తింటూ, సమాజానికి దూరంగా ఉండే అఘోరాగా మనోజ్ నటన తారాస్థాయిలో ఉంటుందని సమాచారం. మొత్తంగా రీ ఎంట్రీతో సాహసం చేస్తున్న మనోజ్ ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తాడో వేచిచూడాలి.

- Advertisement -