రిక్షా కార్మికుడిని కలిసిన ప్రధాని …

155
modi

రిక్షా కార్మికుడితో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. వారణాసి పర్యటనలో భాగంగా ఈ నెల 16న రిక్షా కార్మికుడు కేవత్‌ని కలిసిన మోడీ అతని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేవత్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంగల్‌ కేవత్‌… తన కుమార్తె పెళ్లి సందర్భంగా మొదటి ఆహ్వానాన్ని ప్రధాని మోడీకి పంపానని చెప్పారు. తర్వాత మోడీ నుంచి ఆశీస్సులు తెలుపుతూ లేఖ వచ్చిందన్నారు. ప్రధాని లేఖను చూసిన వెంటనే తాము ఎంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యాము అని వెల్లడించారు.

కేవత్‌ గంగా నది భక్తుడు. తనకు వచ్చిన ఆదాయంలో కొంత గంగా ప్రక్షాళన కోసం ఖర్చు పెట్టడం విశేషం. ఇక కేవత్‌ నివాసముంటున్న డోమ్రి గ్రామాన్ని నరేంద్ర మోడీ దత్తత తీసుకున్నారు.