వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ.. అనతికాలంలోనే కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న మంచు మనోజ్ పుట్టినరోజు నేడు (మే 20). ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు ఫిలిమ్ నగర్ లోని మంచు మనోజ్ నివాసానికి విచ్చేసి.. హంగులు, ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా మంచు మనోజ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. “నా ప్రతి పుట్టినరోజునాడు అభిమానులు, సన్నిహితులు ఇంటికి రావడం అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం జరిగేది. కానీ.. ఈ ఏడాది ఇంటికి ఎక్కువమందిని రావద్దని నేనే చెప్పాను. పుట్టినరోజంటే.. ఒక ప్రత్యేకమైన దినం కాబట్టి ఏదైనా మంచి సర్వీస్ చేయమని చెప్పాను. కొద్ది గంటల్లో ఫేస్ బుక్ లైవ్ లో అందరినీ పలకరించనున్నాను. ఈ ఏడాది రైతుల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోనున్నాం.
నాతోపాటు నన్ను అభిమానించే వారందరూ రైతులకు అండగా నిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నాం. నాదీ రైతు కుటుంబమే, మా తాతగారు రైతు, అందుకే రైతుకు బాసటగా నిలవాలని ప్రయత్నిస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను. నా పుట్టినరోజు సందర్భంగా మా ఇంటికి వచ్చి నాకు అభినందనలు తెలిపిన నా అభిమాన సోదరులందరికీ ధన్యవాదాలు, వీరి ప్రేమ ఎప్పటికీ ఇలానే కొనసాగాలని కోరుకొంటున్నాను” అన్నారు.
రాకింగ్ స్టార్ జన్మదిన వేడుకలు!!
- Advertisement -
- Advertisement -