డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు నేడు. విలన్‌గా, నటుడిగా విభిన్న పాత్రలు పోషించిన మోహన్ బాబు 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు . అటు రాజకీయంగా ఇటు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అనేక హిట్ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారి లక్ష్మీ ప్రసన్న ఆర్ట్ పిక్చర్స్ అనే బేనర్‌ని స్థాపించాడు. మోహన్ బాబు నేటితో 68ఏళ్లు పూర్తి చేసుకుని 69వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నాడు. ఇదే విషయాన్ని తన ట్వీట్టర్ ద్వారా తెలిపాడు మనోజ్. నాన్న పుట్టిన రోజు సందర్భంగా ఏదైనా మంచి పని చేయాలని అనుకున్నానని చెప్పాడు మనోజ్.
సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నట్లు’ చెప్పారు. ఆ అమ్మాయిని విద్యానికేతన్ స్కూల్ లో జాయిన్ చేసినట్లు, తన భాద్యతలన్నీ కూడా నేనే తీసుకుంటానని చెప్పాడు. మంచి చదువు చెప్పిస్తానని, జాగ్రత్తగా చూసుకుంటానని వెల్లడించాడు. ఐఏఎస్ అవ్వాలన్నది ఆ అమ్మాయి లక్ష్యం అని..ఆమె ఆశయం నెరవేరేవరకూ తాను సాయపడతానని తెలిపారు. మంచు మనోజ్ తీసుకున్న ఈనిర్ణయానికి ఆయకు సోషల్ మీడియాలో పలువురు ప్రశంసలు తెలుపుతున్నారు.
Nana’s bday 2mrw & turned 2 be my best! I take pride in #adopting #Ashwitha frm #Sirisilla. Enrolled her 2day at @IVidyanikethan. I hereby, take up all her responsibilities 2 support, educate & ensure her safety & desire to become an #IAS officer!Tq all who helped!❤️#JoyOfGiving pic.twitter.com/31ASlnXIl2
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 18, 2019