చెప్పులు లేకుండా న‌డిచాః మోహ‌న్ బాబు

261
Mohan Babu
- Advertisement -

వైవిధ్యభ‌రిత‌మైన సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుంది మంచు మోహ‌న్ బాబు కూతురు మంచు ల‌క్ష్మీ. లేడి రోల్ లో సినిమాలు చేస్తూ స‌మాజంలో జ‌ర‌గుతున్న అవినీతిని త‌న సినిమాల రూపంలో చూపెడుతోంది. ఇక సినిమాల్లోనే కాకుండా రియాలిటి షోల‌లో చేస్తూ పేద ప్ర‌జ‌ల‌కు సాయం చేస్తోంది. అటు వెండితెర..ఇటు బుల్లి తెర‌పై త‌న‌దైన ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రుస్తోంది. సినిమాల‌లో న‌టించ‌డ‌మే కాకుండా ప‌లు సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది మంచు ల‌క్ష్మీ.WIFE of RAM

ఇటివ‌లే మంచు ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సినిమా ‘w/o రామ్. గ‌త కొద్ది రోజుల క్రిత‌మే ఈసినిమా ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. ఇ ఫ‌స్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. దీంతో నేడు ఉద‌యం ఈసినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు చిత్ర బృందం. త్వ‌ర‌లోనే ఈసినిమాకు సంబంధించిన ఆడియో కార్య‌క్ర‌మం కూడా చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు. ఈట్రైల‌ర్ లాంచింగ్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా మంచు మోహ‌న్ బాబు హాజ‌ర‌య్యారు.

w/o ram movie

ఈసంద‌ర్భంగా మోహ‌న్ బాబు మాట్లాడుతూ.. ఈసినిమా నిర్మాత అమెరికాలో ఉంటారు..కానీ ఆయ‌న‌ నా కూతురు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌ను న‌మ్మి ఇంత డ‌బ్బు పెట్టారంటే నాకు చాలా గ‌ర్వంగా ఉంద‌న్నారు. ట్రైల‌ర్ చూశాను చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈసినిమాలో ల‌క్ష్మీ చాలా అద్భుతంగా న‌టించింద‌న్నారు. డైరెక్ట‌ర్ విజ‌య్ ఈసినిమాను చాలా బాగా తెర‌కెక్కించార‌న్నారు. మొద‌టి సినిమాతోనే విజయ్ కి మంచి స‌క్సెస్ ల‌భించాల‌ని కోరుతున్నాన‌న్నారు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను కూడా కొత్తే .. తొలినాళ్లలో నేను చెప్పులు లేకుండా తిరిగిన రోజులున్నాయి .. ఎన్నో కష్టాలు పడుతూ ప్లాట్ ఫామ్ నుంచి ఈ స్థితికి వచ్చాను అన్నారు. ఈసినిమా త‌ప్ప‌కుండా మంచి విజ‌యాన్ని అందుకుంటుంద‌ని..సినిమా యూనిట్ కు అభినంద‌న‌లు తెలిపారు.

- Advertisement -