గ్రీన్‌ ఛాలెంజ్‌…స్వాగత్‌ యాజమాన్యం

249
- Advertisement -

టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌ మానసపుత్రికైన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలు పాల్గొన్ని మొక్కలు నాటుతున్నారు. మొక్కలు నాటడమే కాకుండా మొక్కల యొక్క ఉపయోగం గురించి వివరిస్తున్నారు. తాజాగా మంచిర్యాల స్వాగత్‌ ప్రైడ్‌ హోటల్‌ యాజమాన్యం.

ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ.. స్వాగత్‌ ప్రైడ్‌ హోటల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మొక్కలునాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నాటిన మొక్కలను యాజమాన్యం కంటికి రెప్పలా కాపాడుతున్నామని అన్నారు. ప్రతిఒక్కరు బాధ్యత యుతంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

నలుగురికి నీడనిచ్చే చెట్లను నాటే కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన గ్రీన్‌ ఇండియా ప్రధాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల దిలీప్‌, శ్రీధర్‌, శ్రీనివాస్‌, రాధ రెడ్డి, నరసింహరెడ్డి, నాగుల శివ కుమార్‌, సంతోష్‌కుమార్‌, నర్సింగారావు, తదితరులు పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి..

25న..ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

పీఎస్‌2 ఎప్పుడంటే…

భారతీయులు గొప్పోళ్లు..పుతిన్ ప్రశంస

- Advertisement -