రివ్యూ:మనసుకి నచ్చింది

230
Manasuku Nachindi Movie Review
- Advertisement -

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. మరి ఇన్ని భారీ అంచనాల మధ్య విడుదలైన మనసుకి నచ్చింది ప్రేక్షకులకు నచ్చిందా లేదా చూద్దాం.

కథ :

సూరజ్‌(సందీప్‌ కిషన్‌), నిత్య (అమైరా దస్తర్‌) ఒకే ఫ్యామిలీలో కలిసి పెరిగిన స్నేహితులు. వాళ్ల స్నేహాన్ని ప్రేమగా భావించిన పెద్దవాళ్లు వాళ్లకు పెళ్లిచేయాలని నిర్ణయిస్తారు. కానీ తమ మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదని సూరజ్‌, నిత్యలు ఇంట్లోనుంచి పారిపోతారు. అక్కడే సినిమా మలుపు తిరుగుతుంది. చివరకు సూరజ్‌.. నిత్య ప్రేమను అర్ధం చేసుకున్నాడా..? వారిద్దరు ఒక్కటయ్యారా..? లేదా అన్నది తెరమీద చూడాల్సిందే.

 Manasuku Nachindi Movie Review

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫి,హీరోయిన్ గ్లామర్‌. సందీప్‌ కిషన్‌ యూత్‌ ఫుల్‌ క్యారెక్టర్ లో ఇమిడిపోయాడు. హీరోయిన్‌ అమైర దస్తర్‌ సినిమాకు హైలైట్. తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మరో హీరోయిన్‌గా నటించిన త్రిదా చౌదరి పూర్తిగా గ్లామర్‌ షోకే పరిమితమైంది. ప్రియదర్శి, అదిత్‌ అరుణ్‌, నాజర్‌, సంజయ్‌, అనితా చౌదరి తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథా, కథనం. ప్రియదర్శి లాంటి లీడింగ్ కమెడియన్‌ను హీరో ఫ్రెండ్‌ పాత్రకు తీసుకున్నా.. సరిగ్గా ఉపయోగించుకోలేదు. ప్రియదర్శి డైలాగ్స్‌లో గత చిత్రాల్లో కనిపించే చమక్కులు ఈ సినిమాలో మిస్‌ అయ్యాయి. కథలో కొత్తదనం లేకపోవటం  ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిస్తుంది. సినిమాలో ఆకట్టుకునే అంశం సినిమాటోగ్రఫి, ప్రకృతి అందాలను వెండితెర మీద మరింత అందంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ రవియాదవ్‌. రధన్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్‌, నిర్మాణవిలువలు బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా ప్రతీ ఫ్రేము రిచ్‌గా తెరకెక్కించారు.

 Manasuku Nachindi Movie Review

సాంకేతిక విభాగం:

షో సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి మంజుల ఘట్టమనేని. తొలిసారిగా మెగాఫోన్ పట్టుకుని రొటీన్‌ ట్రయాంగ్యులర్‌ లవ్‌ స్టోరికి నేచర్‌ అనే ఎలిమెంట్‌ను జోడించి ప్రేక్షకుల ముందుకువచ్చింది. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ కాగా కథలో కొత్తదనం లేకపోవడం మైనస్. ఓవరాల్‌గా పర్వాలేదనిపించే మూవీ మనసుకినచ్చింది.

విడుదల తేదీ:16/02/2018
రేటింగ్:2.25/5
నటీనటులు : సందీప్‌ కిషన్‌, అమైరా దస్తర్‌, త్రిదా చౌదరి,
సంగీతం : రధన్‌
నిర్మాత : సంజయ్‌ స్వరూప్‌, పి.కిరణ్‌
దర్శకత్వం : మంజుల ఘట్టమనేని

- Advertisement -