ఆక‌ట్టుకుంటున్న ‘మ‌న‌సు దారి త‌ప్పెనే’ సాంగ్‌..

182
- Advertisement -

సాయి ధ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌లో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కెవి ధీరజ్, నవకాంత్ ల‌ను హీరోలుగా ప‌రిచ‌యం చేస్తూ శ్రీ‌మ‌తి వాగేశ్వ‌రి(ప‌ద్మ‌) స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ ప‌తాకంపై పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తోన్న చిత్రం షికారు. హరి కొలగాని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నుండి సిద్ శ్రీ‌రామ్ ఆల‌పించిన మ‌న‌సు దారి త‌ప్పెనే.. పాట‌ను మెగాహీరో వ‌రుణ్ తేజ్ ఈ రోజు విడుద‌ల చేశారు.

మ‌న‌సు దారి త‌ప్పెనే వ‌య‌సు గోడ దూకెనే..మ‌న‌సు దారి త‌ప్పెనే వ‌య‌సు గోడ దూకెనే అరే అరే అరే హాయ్ అంటే నువ్వు పెద‌విపై న‌వ్వు ఆగ‌నె ఆగ‌దే..ఆగ‌నె ఆగ‌దే నీ వంటి మెరుపు చూసె వ‌ర‌కూ ఎంత‌టి అంద‌మో ఊహ‌కి అంద‌లే…అంటూ సాగే ఈ పాట‌కు భాస్క‌ర‌భ‌ట్ల సాహిత్యం అందించారు. ఇక సిద్ శ్రీ‌రామ్ త‌న వాయిస్‌లోని మ్యాజిక్‌ను మ‌రోసారి రిపీట్ చేశారు. శేఖ‌ర్ చంద్ర బాణీలు శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌స్తుతం ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

తారాగణం : సాయి ధ‌న్సిక, తేజ్ కూర పాటి, అభినవ్ మేడిశెట్టి, కెవి ధీరజ్, నవకాంత్, కన్నడ కిషోర్, పోసాని క్రిష్ణ మురళి, గాయత్రి రెడ్డి (బిగిల్ ఫేమ్ ), చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ, సురేఖా వాణి.

- Advertisement -