వాలెంటైన్స్ డేకి ‘సర్కారు వారి పాట’ నుండి సర్‌ప్రైజ్‌..

42
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్లు ఈ మూవీని మే 12న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నారు.

సినిమాలో కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ఇది కచ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్ స్వరపరిచిన ఈ పాటతో అందరూ ప్రేమలో పడనున్నారు.

మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నారు దర్శకులు పరుశురాం. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.సర్కారు వారి పాట వేసవి కానుకగా మే 12న విడుదల కానుంది.

నటీనటులు : మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు

సాంకేతిక బృందం

రచయిత, దర్శకుడు : పరుశురామ్ పెట్లా
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్స్ : మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
సంగీతం : తమన్
సినిమాటోగ్రఫీ : ఆర్ మధి
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ : ఏఎస్ ప్రకాష్
ఫైట్స్ : రామ్ లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్
కో డైరెక్టర్ : విజయ రామ్ ప్రసాద్
సీఈవో : చెర్రీ
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : యుగంధర్

- Advertisement -