కళ్ళు చూసి ఈ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్ అని చెప్పారు- సాయి ధన్సిక

82
- Advertisement -

డైరెక్టర్ హరి దర్శకత్వంలో సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా ‘షికారు’. ఈ మూవీ జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ బాబ్జి మాట్లాడుతూ.. ఇక్కడకివచ్చిన మీడియా మిత్రులు అందరికి నా ధన్యవాదాలు, కరోనా ఇబ్బందులు దాటుకొని ‘షికారు’ సినిమా పూర్తి చేసాం, షికారు టైటిల్ లాగానే సినిమా కూడా బాగా వచ్చింది, కచ్చితంగా సినిమా పెద్ద హిట్ ఆవుతుంది. మా హీరోయిన్ ధన్సిక చాలా బాగా చేసింది, నలుగురు యువ హీరోలు చాలా బాగా చేశారు. సిద్ శ్రీ రామ్ పాడిన పాట బాగా వచ్చింది ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుంది. మా డైరెక్టర్ హరి కథ చెప్పునప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో, సినిమా తీసిన విధానం చూసి అంతకు మించి ఎక్సయిట్ అయ్యాను, మాకు మీడియా మిత్రుల సహకారంతో ఈ సినిమాను ఇంకా ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నాం. దానికి మీడియా మిత్రులు అందరి సహకారం కోరుకుంటున్నాం, జనవరి 26న మా సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.

డైరెక్టర్ హరి మాట్లాడుతూ.. ఒక చిన్న సినిమా ముందుకు రావాలి అంటే ప్రొడ్యూసర్ కావాలి, ఇలాంటి సినిమాను డైరెక్ట్ చేయమని నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బాబ్జికి థాంక్స్, నేను ఏ ఆర్టిస్ట్‌లు కావాలంటే వాళ్ళని నాకు ఇచ్చారు బాబ్జి. అలాగే టెక్నికల్ టీమ్‌ను నాకు కావాల్సిన వాళ్ళని అందరిని సమకూర్చారు బాబ్జి,మా హీరోయిన్ సాయి ధన్సిక చాలా బాగా చేసింది. ఈ మూవీలో నలుగురు హీరోలని పరిచయం చేయటం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. రైటర్ కరుణ్ నాకు నా సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఆర్ట్ డైరెక్టర్ షర్మిల కూడా ఈ రోజు తన మ్యారేజ్ పనులులో బిజీ గా ఉండి ఇక్కడకి రాలేక పోయారు. తనకి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను. శేఖర్‌ చంద్ర ఫోర్ సాంగ్స్ కంపోజ్ చేశారు. భాస్కర్ పట్ల మూడు సాంగ్స్ రాశారు, మీ సహకారంతో ముందు ముందు ఇంకా కావాలి అని కోరుకుంటున్నాను.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ముందుగా షికారు టీంకి నమస్కారం, ప్రొడ్యూసర్ బాబ్జి ఇండస్ట్రీలో తెలుగు సినిమా చరిత్రలో ఆరువందల సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు, సినిమా మీద వున్న ఆయనకున్న జడ్జిమెంట్ ఆయనకున్న పట్టు ఎవరికీ లేదు అని చెప్పాలి. తనకి ఒక జడ్జిమెంట్ వుంది నేను ఏ సినిమాలు చేసిన తన జడ్జిమెంట్ తీసుకుంటాను, ప్రొడ్యూసర్ గా చేయటం తన డ్రీం, హరితో కూడా నాకు జర్నీ ఉంది. తరువాత బాబ్జి గారి కి వినిపించడం అలా సినిమా స్టార్ట్ అవ్వటం జరిగింది. యూత్ అంత అట్ట్రాక్ట్ అయ్యే సినిమా, టీమ్ కి మంచి బ్రేక్ ఇచ్చే సినిమా ఈ సినిమాకి బాబ్జి ఒక రేంజ్‌లో పబ్లిసిటీ చేస్తారు, ఈ సినిమా ఆయనకి ప్రొడ్యూసర్ గా మంచి జర్నీకి పునాది కావాలి అని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ డి. ఏస్. రావు మాట్లాడుతూ.. మన జీవితంలో ప్రతి రోజు గంట లేదా అరగంట షికారు చేస్తూవుంటాము, మొదటిగా షికారు టీమ్ అందరికినా అభినందనలు, ప్రొడ్యూసర్ బాబ్జి మా పిల్ల జమిందార్ డిస్ట్రిబ్యూటీర్, కధల విషయంలో మంచి అవగాహనా వుంది, అఖండ సినిమా హిట్ అవ్వగానే బాబ్జి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తున్నారు,షికారు మంచి హిట్ కావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

రైటర్ కరణ్ మాట్లాడుతూ.. మా షికారు సినిమాలో రెండున్నర గంటలు ఫన్ ఉంటుంది,ఈ అవకాశం నాకు ఇచ్చిన డైరెక్టర్ హరి మరియు ప్రొడ్యూసర్ బాబ్జికి నా కృతజ్ఞతలు అన్నారు.

హీరో అభినవ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ హరి ప్రొడ్యూసర్ బాబ్జి ఒక స్క్రిప్ట్ తో వచ్చారు, ఇంత మంచి స్క్రిప్ట్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్, హీరోయిన్ సాయి ధన్సిక లీడ్ రోల్ చేస్తుంది. టోటల్ జర్నీ షూట్ బాగా ఎంజాయ్ చేశాము, మీ అందరి సహకారం కావాలి అని కోరుకుంటున్నాను.

ధీరజ్ మాట్లాడుతూ.. షికారు అనే మూవీ నాకు రైటర్ కరుణ్ రిఫర్ చేశాడు,10 ఇయర్స్ తరువాత ఇంత నవ్వుకునే సినిమా చూసి వుండరు తప్పకుండ మీకు అందరిని అలరిస్తుంది మా షికారు మూవీ అని అన్నారు.

నవకాంత్ మాట్లాడుతూ.. ఫస్ట్ సినిమా నాకు ఇది ఇంత మంచి స్క్రిప్ట్ లో నన్ను వుంచుకుంటారా అని ఆలోచించాను.. కాని ఈ సినిమాలో మంచి నేమ్ వున్న హీరోస్ తో చేయవచ్చు కాని కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి అని మాకు ఈ అవకాశం ఇచ్చారు,షికారు సినిమా చిన్నది పెద్ద హిట్ అవుతుంది అని మాత్రం చెప్పగలను.

సుభాష్ కొరియోగ్రాఫర్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ హరికి అలాగే ప్రొడ్యూసర్ బాబ్జికి నా థాంక్స్ చెప్పుకుంటున్నాను.

డిఓపి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. డైరెక్టర్ హరి ఆడియన్స్ కి బెస్ట్ ఫిల్మ్ ఇవ్వలి చాలా హార్డ్ వర్క్ చేసాడు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ప్రౌడ్ గా ఫిల్ అవ్వుతున్నాను.

హుషారు ఫేమ్ తేజు మాట్లాడుతూ.. రేపటితో హుషారు రిలీజ్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది, మేము ఏ శుక్రవారం వస్తామో తెలియదు కాని ఆ శుక్రవారం మాత్రం మా షికారు సినిమా శుక్రవారం అవుతుంది అని చెప్పగలను.

హీరోయిన్ సాయి ధన్సిక మాట్లాడుతూ.. మీరు అందరు ఇక్కడకి వచ్చినందుకు థాంక్స్, అందరికి రిక్వెస్ట్ చేసి చెపుతున్నాను. అందరు సేఫ్ గా వుండండి, ఈ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్, తమిళ్ లో చాలా ఫిల్మ్స్ చేశాను,కబాలిలో చేశాను, హరి చెన్నయ్ వచ్చి కధ చెప్పారు, మీ కళ్ళు చూసి ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అని హరి చెప్పారు. ఈ క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్ క్యారెక్టర్, ప్రొడ్యూసర్ గారి తో అలాగే డైరెక్టర్ గారి తో నాకు చాలా కంఫర్ట్ వుండింది. ఈ మూవీలో నాతో యాక్ట్ చేసిన మా టీమ్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

తారాగణం :సాయి దన్సిక,తేజ్ కూర పాటి, అభినవ్ మేడిశెట్టి, కెవి ధీరజ్, నవకాంత్,కన్నడ కిషోర్, పోసాని క్రిష్ణ మురళి, గాయత్రి రెడ్డి (బిగిల్ ఫేమ్ ), చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ,సురేఖా వాణి.

టెక్నిషియన్స్ :శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్
మూవీ :షికారు (AN Unlimited fun ride)
ప్రొడ్యూసర్ :పి. ఎస్. ఆర్ కుమార్ (బాబ్జి,వైజాగ్ )
స్టోరీ -స్క్రీన్ ప్లే -డైరెక్షన్ :హరి కొలగాని
కో -ప్రొడ్యూసర్ :సాయి పవన్ కుమార్
డి ఓ పి :వసిలి శ్యామ్ ప్రసాద్
మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ :శేఖర్ చంద్ర
డైలాగ్స్ :విశ్వ కరుణ్
ఆర్ట్ డెరెక్టర్ :షర్మిల ఎలిశెట్టి
ఎడిటర్ :వెంకటేశ్వరరావు శృంగవరపు
లిరిక్స్ :భాస్కర్ పట్ల
చీఫ్ కో డైరెక్టర్ :సురేష్ నది కొప్పుల
కొరియోగ్రాఫర్ :సుభాష్ సారికొండ
యాక్షన్ :రొబ్బిన్ సుబ్బు
లైన్ ప్రొడ్యూసర్ -వెంకటేష్ ఏస్. కె. కులపాక
ప్రొడక్షన్ కంట్రోలర్ :అక్కినేని శ్రీనివాసరావు
పి ఆర్ వో :తేజస్వి సజ్జా
పబ్లిసిటీ డిజైన్స్ :దని ఎలే

- Advertisement -