మామిడి .. తింటే ఏమౌతుందో తెలుసా ?

29
- Advertisement -

వేసవిలో మాత్రమే దొరికే ఫలాలలో మామిడి కూడా ఒకడి. వేసవిలో ఎక్కడ చూసిన మామిడి పండ్లు, కాయలు, మ్యాంగో జ్యూస్ వంటివి కనిపిస్తూ నోరురిస్తుంటాయి. మామిడి పండుకు ఉండే రుచి కారణంగా పండ్లలో రారాజుగా పోలుస్తారు. అయితే మామిడిలో చాలా రకాలే ఉన్నాయి. బంగినపల్లి, తొతపురి, నీలం, సువర్ణరేఖా ఇలా రకరకలుగా మామిడి మార్కెట్ లో దర్శనమిస్తూ ఉంటుంది. అయితే మామిడి పండును ఎంతో ఇష్టంగా తినే చాలమందికి ఆ పండు తినడం వల్ల కలిగే లాభనష్టాల గురించి మాత్రం సరైన అవగాహన ఉండదు. కాబట్టి ఈ వేసవిలో ఎక్కువగా దొరికే మామిడి తినడం వల్ల కలిగే లభ నష్టాల గురించి తెలుసుకుందాం.

ఉపయోగాలు :
మామిడి పండు సకల పోషకాల సమ్మేళనం. ఇందులో విటమిన్ ఇ, సి, కె, బి కాంప్లెక్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి. దాంతో మామిడి పండు తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. మలబద్దకంతో బడపడే వాళ్ళు మామిడి పండు కచ్చితంగా తినాలని న్యూతృషియన్స్ చెబుతున్నారు. ఇక మామిడికి శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించే గుణం ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. తద్వారా గుండె సమస్యలు, హైపర్ టెన్షన్ వంటివి దరిచేరవు. ఈక మామిడిలో ఉండే ఐరన్ కారణంగా రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. అలాగే కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంతో పాటు కంటి యొక్క ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది మామిడి.

Also Reaad:Karnataka Results:కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు

నష్టాలు:
అయితే మామిడి తినడం వల్ల ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. మామిడి పండ్లు అధికంగా తింటే విరోచనల బారిన పడే అవకాశం ఉంది. అంతే కాకుండా వేడి గుల్లలకు కూడా కారణం అవుతుంది మామిడి. అలాగే మార్కెట్ లో రసాయనిక మందులతో మామిడి పండ్లను కల్తీ చేయడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.

జాగ్రత్తలు:
కాబట్టి మామిడి పండ్లు చెట్టు నుంచి పండినవి మాత్రమే తింటే మంచిది. అలాగే మితంగా మాత్రమే మామిడి పండ్లను తినాలి. అమితంగా తిని లేని సమస్యలను కొని తెచ్చుకోరాదని నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -