బెంగాల్ దీదీ ప్రభంజనం వీసిన నందిగ్రామ్‌లో మాత్రం మమతా ఓడిపోయిన సంగతి తెలిసిందే. నందిగ్రామ్‌లో రీకౌంటింగ్ చేయాలని మమతా డిమాండ్ చేయగా నో చెప్పింది ఎలక్షన్ కమిషన్. వీవీ ప్యాట్ స్లిప్స్‌ను లెక్కించిన తర్వాత ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తామని రిటర్నింగ్ ఆఫీసర్ స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో సువేందు అధికారి 1736 ఓట్ల తేడాతో మమతను ఓడించిన విషయం తెలిసిందే.
కౌంటింగ్ ప్రక్రియపై సుప్రీంకు వెళ్తామని ముఖ్యమంత్రి మమత ప్రకటించారు. నందిగ్రామ్‌లో ప్రజల తీర్పును గౌరవిస్తూనే.. ఎన్నికల సంఘం తీరుపై కోర్టుకు వెళ్తామని చెప్పారు. మొత్తం 17 రౌండ్ల కౌంటింగ్ తర్వాత సువేందుకు 109673 ఓట్లు, మమతకు 107937 ఓట్లు వచ్చినట్లు తేల్చింది.