రాష్ట్రపతి ఎన్నికపై దీదీ వ్యూహం.. కేసీఆర్‌కు లేఖ..

93
- Advertisement -

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీల అధ్యక్షులకు, ముఖ్యమంత్రులకు మమతా బెనర్జీ లేఖ రాశారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల దృష్ట్యా విప‌క్షాల‌ను ఆమె కూడ‌గ‌డుతున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని బ‌రిలో నిలిపేందుకు మ‌మ‌త తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ మేరకు మొత్తం 22 మంది ప్రతిపక్ష నాయకులు, సీఎంలకు లేఖలు రాశారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలని ఆమె పిలుపు నిచ్చారు. ఈ మేరకు మమతా బెనర్జీ జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

ఈ భేటీకి రావాలంటూ ప్రముఖ విపక్ష నేత‌ల‌కు ఆహ్వానం పంపారు. తెలంగాణ‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్‌, ఒడిశా, పంజాబ్ సీఎంల‌తో పాటు ప‌లువురి ప్ర‌ముఖుల‌కు లేఖ‌లు రాశారు మ‌మ‌తా బెన‌ర్జీ. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌కు మ‌మ‌తా బెన‌ర్జీ శనివారం లేఖ పంపారు. ఢిల్లీలో ఈ నెల 15న జ‌రిగే స‌మావేశానికి సీఎం కేసీఆర్‌ను మ‌మ‌తా బెనర్జీ ఆహ్వానించారు.

- Advertisement -