బెంగాల్ సీఎం మమతాపై దాడి..

346
mamatha
- Advertisement -

బెంగాల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్దం తారాస్ధాయికి చేరగా ఇక ఎన్నికల వేళ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. సీఎం మమతా బెనర్జీపై దాడి చేశారు కొంతమంది దుండగులు. కారు ఎక్కబోతుండగా నెట్టడంతో డోర్‌ తాకి మమత ఎడమకాలికి గాయమైంది. ఘటన జరిగిన సమయంలో పోలీసులు ఎవరూ లేరు.

ఇది తనపై దాడి కుట్ర అని మమత ఆరోపించారు. దాడిపై వెంటనే సమగ్ర నివేదికను సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కుట్రకు పాల్పడినవారికి ప్రజలే బుద్ధి చెప్తారని రాష్ట్ర మంత్రి సుబ్రతా ముఖర్జీ అన్నారు.మరోవైపు టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ప్రజల సానుభూతి కోసం ప్రమాదాన్ని కుట్రగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

బుధవారం నందిగ్రామ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు మమతా. తప్పకుండా విజయం సాధిస్తానని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. నామినేషన్‌కు ముందు మమత 2 కిలోమీటర్లు రోడ్‌ షో నిర్వహించారు.

- Advertisement -