కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్లకు నేటితో గడువు ముగియనుంది. ఇవాళ శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ నామినేషన్ దాఖలు చేయనుండగా చివరి నిమిషంలో మరో పేరు తెరపైకి చ్చింది. సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
సోనియాగాంధీతో గురువారం అర్థరాత్రి ఖర్గే ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో ఖర్గే అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు సమాచారం. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే అభ్యర్థిత్వానికి సోనియా, రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం 80 ఏళ్ల వయస్సులో ఉన్న ఖర్గే కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన దళిత నేత. 1960 లలో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. గుర్మిట్‌కల్ నియోజకవర్గం నుండి తన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఖర్గే తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో అతను గుల్బర్గా నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014లో లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడయ్యారు.