మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ మధ్య కుచ్ కుచ్ అంటూ ఆ మధ్య పుకార్లు చెలరేగాయి. వెంటనే తమన్నా ‘ఖండించింది’. కానీ, ఆ ఖండనలో నిజమేనేమో అనే అనుమానం రేకెత్తింది. ఆ తర్వాత విజయ్ వర్మ కూడా అదంతా ఉత్తిదే అని చెప్పారు. కానీ తాజాగా మళ్లీ ఈ ముదురు ప్రేమ జంట అడ్డంగా దొరికిపోయారు. తాజాగా ముంబైలో ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఈ జంట తిరిగి వెళ్తున్న క్రమంలో కెమెరాకు చిక్కారు. పైగా వీరిద్దరూ మీడియాకు హాయ్ చెప్పడమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఎలాగూ మీడియాకి జంటగా హాయ్ చెప్పారు కాబట్టి.. తమ రిలేషన్ గురించి వీరిద్దరూ త్వరలోనే బయటపెడతారేమోనని తమన్నా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే, కొందరు తమన్నా అభిమానులు మాత్రం ఈ విషయాన్ని అసలు అంగీకరించలేకపోతున్నారు. విజయ్ వర్మ జస్ట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. మరి అతన్ని, తమన్నా ఎందుకు లవ్ చేస్తోంది ?, పైగా చాలా కాలంగా అతనితో డేటింగ్ కూడా చేస్తోంది.
Also Read: సామ్.. ఎందుకు మంచులక్ష్మిలా ?
నిజానికి తమన్నా కాస్త కమర్షియల్ గా ఉంటుంది. మరి విజయ్ వర్మ బ్యాంక్ బ్యాలెన్స్ తమన్నాని ఆకట్టుకుందా ?, లేక, ప్రేమ గుడ్డిది అని ఓ పాత డైలాగ్ ప్రకారం.. తమన్నా కూడా గుడ్డిగా విజయ్ వర్మతో ప్రేమలో పడిందా ? అనేది ఆమెకే తెలియాలి. ఇంతకీ ఈ ప్రేమ జంట పెళ్లి వరకూ వెళ్తారా ? లేదా ? అనేది కూడా కాలమే సమాధానం చెప్పాలి.
Also Read: అక్టోబర్ నుంచి రామ్ తో షురూ