ఏసీపీ నర్సింహారెడ్డి రిమాండ్ రిపోర్ట్…

185
acp narasimhareddy
- Advertisement -

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నర్సింహారెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించింది ఏసీబీ. ఇందులో A-1నర్సింహారెడ్డి, A-2 గోపగాని రాజలింగం, A-3 గోపగాని సజ్జన్ గౌడ్, A-4 పోరేటి వెంకట్ రెడ్డి, A-5 పోరేటి తిరుపతి రెడ్డి,A-6 ఎర్ర శంకరయ్య, A-7 ఎర్ర చంద్రశేఖర్, A-8 అర్జుల గాలి రెడ్డి, A-9 అర్జుల జైపాల్,A-10 మదుకర్ శ్రీరామ్,A-11 చంద్రా రెడ్డి,A-12 బత్తిని రమేష్,A-13 అలుగు వెళ్లి శ్రీనాస్ రెడ్డిలు ఉన్నారు.

ఇందులో 11 మందిని అరెస్ట్ ఏసీబీ చేసింది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నర్సింహారెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో A-2 నుండి A -13 వరకు ఉద్దేశ్య పూర్వకంగానే నర్సింహారెడ్డికి సహకరించారన్న ఏసీబీ వెల్లడించింది. హైటెక్ సిటీ సర్వే నెంబర్ 64లోని 60 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నిందితులు కబ్జా చేశారు. అందులో 2 వేల గజలా భూమిని 490 గజాలుగా విభజించి నాలుగు డాక్యుమెంట్లు సృష్టించిన నిందితులు.. మొదట తండ్రుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి తరువాత కొడుకుల పేరిట గిఫ్ట్ డీడ్ గా మార్చారు.

గిఫ్ట్ డీడ్ నుంచి నర్సింహారెడ్డి భార్య పేరుతో పాటు మరో నలుగురు భినామిల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఏసీపీ నర్సింహారెడ్డి. 2 వేల గజాల భూమి ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు తేల్చారు. నిందితులకు ప్రభుత్వ భూమిపై ఎలాంటి హక్కు లేకున్నా ప్రయివేటు భూమిగా మార్చారని ఏసీబీ తెలిపింది. వీటితో పాటు నర్సింహారెడ్డి బినామి ఆస్తులను భారీగా గుర్తించింది ఏసీబీ.హైదరాబాద్ నాలుగు నివాస గృహాలు, అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమిని ఏసీబీ గుర్తించింది.

- Advertisement -