తెలుగు సినిమా రోజురోజుకు అభివృద్ది చెందుతుండడం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా..విదేశాల్లో సైతం తెలుగు సినిమాకి డిమాండ్ ఉండడంతో రచయితలు, దర్శకనిర్మాతలు విదేశాల్లో ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథలు రెడీ చేస్తున్నారు. విదేశాల్లో షూటింగ్ చేసే సినిమాలకు ఆయా దేశాలు షూటింగ్ పర్మిషన్స్ సకాలంలో ఇప్పించడంతో పాటు రిటర్న్ గిఫ్ట్ లా కొంత మొత్తాన్ని కూడా ఇస్తున్నాయి. తాజాగా మలేషియా ప్రభుత్వం కూడా తమ దేశంలో షూటింగ్ చేస్తే సకాల సదుపాయాలను కల్పించడంతో పాటు తమ దేశంలో కావల్సిన అన్ని పర్మిషన్స్ ను వెంటనే అందిస్తామంటోంది.మలేషియాలోని పెరాక్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాతో శ్రీ అహమద్ ఫైజల్ అజుమూతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీట్ & గ్రీట్ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి గురు ఫిల్మ్స్ సునీత తాటి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో మలేషియాలోని పెరాక్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాతో శ్రీ అహమద్ పైజల్ అజుమూ మాట్లాడుతూ…నా ఫ్రెండ్ మహేష్ తో ఎప్పటి నుంచో ఇండియా రావాలి అని చెప్పాను. ఈరోజు హైదరాబాద్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇండియా ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. మలేషియాలో సంవత్సరానికి ఒకసారైనా ఇండియా ఫుడ్ తింటుంటాను. కౌలాలాంపూర్ నుంచి చెన్నైకి రావడానికి 3 గంటలు పట్టింది. చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి 3 గంటల టైమ్ పట్టింది. దీనిని బట్టి ఇండియా ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు.
ఇక నా గురించి చెప్పాలంటే..దత్తా శ్రీ అహమద్ ఫైజల్ అజుమూ అయినప్పటికీ పెజా అని పిలుస్తారు. మలేషియాలో 13 రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఉన్న పెద్ద రాష్ట్రాల్లో పెరాక్ ఒకటి. పెరాక్ అంటే సిల్వర్ అని అర్ధం. ఈ రాష్ట్రంలో 48% అడవి ఉంటుంది. పెరాక్ లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సినిమా షూటింగ్ నిమిత్తం నిర్మాతలు ఏసియాలో చాలా దేశాలకు వెళ్లుంటారు. అయితే…పెరాక్ రాష్ట్రం రావాలని కోరుతున్నాను. తెలుగు నిర్మాతలను ఆహ్వానించడం కోసమే హైదరాబాద్ వచ్చాను. నా మిత్రుడు మహేష్, వివేక్ కూచిభట్ల నన్ను ఇక్కడికి రావాలని ఆహ్వానించారు. వారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.
ప్రముఖ నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ…మా దేశం వచ్చినందుకు పెరాక్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాతో శ్రీ అహమద్ పైజల్ అజుమూ గారికి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. అలాగే ఆయన పవర్ ఫుల్ స్పీచ్ వినడం హ్యాపీగా ఫీలవుతున్నాను. ఇక నుంచి మా సినిమా మేనేజర్లు యూరప్ అంటే వెళ్లం. మలేషియాకే వస్తాం. మలేషియా అంటే కౌలాలాంపూర్ మాత్రమే అనుకునే వాళ్లం. కానీ…చాలా మంచి బ్యూటీఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడే తెలిసింది. సినిమా అనేది ప్రపంచాన్ని చూడడానికి విండో లాంటిది. వెంటనే పెరాక్ లో షూటింగ్ చేయాలనిపిస్తుంది. పెరాక్ ముఖ్యమంత్రి దాతో శ్రీ అహమద్ ఫైజల్ అజుమూ గారితో మీట & గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేష్,వివేక్ కూచిభట్లకు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.