- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ రాంలీల మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ…దేశంలో ఎక్కడా లేని విధంగా 54లక్షల మందికి రూ.18వేల కోట్లను స్వావలంబన కింద అందిస్తున్నామన్నారు. వడ్డీ లేని రుణాలు అభయహస్తం త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. ఉద్యోగం కోసం బయటకు వచ్చే ఆడబిడ్డలకు భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రూ.8000కోట్లతో ప్రభుత్వ పాఠశాల్లో ఆడపిల్లలకు టాయిలెట్లు నిర్మిస్తున్నామని అని అన్నారు.
ఇవి కూడా చదవండి…
ప్రభాస్ సెట్ లో అమితాబ్ కి గాయాలు
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ #శర్వా 35..
ఆ సీన్ కోసం చాలా కష్టపడ్డా…శైలజ
- Advertisement -