సూపర్ స్టార్ మహేశ్ బాబు తను ఖాళీగా ఉన్న సమాయంలో ఎక్కువగా ఫ్యామిలీతో గడుపుతారు. షూటింగ్ లేని సమయంలో ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్తుంటారు. ఈ న్యూఇయర్ కి కూడా మహేశ్ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా దుబాయ్ కి వెళ్లిన మహేశ్ అక్కడ పార్టీలో సితార, గౌతమ్ తో కలిసి సరదాగా గడిపారు. డిసెంబర్ 31 రాత్రి కూతురు సితారతో కలిసి మహేష్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అక్కడ అందరూ పిల్లలు తమ ఫాదర్స్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. మహేష్ కూడా సితార చేతులు పట్టుకొని సరదాగా స్టెప్పులు వేశారు. ప్రస్తుతం మహేశ్ బాబు నటిస్తున్న మహర్షీ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈఏడాది ఏప్రిల్ 5న మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. వంశీ పైడిపల్లి ఈచిత్రినికి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, అశ్వినిదత్ లు సంయుక్తంగా నిర్మిస్తోన్నారు. మహేశ్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటించగా.. అల్లరి నరేష్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు.