మహేష్ కొత్త లుక్ వైరల్

22
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే. ఆయన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తారు. మహేష్ బాబు ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో మహేశ్ షేర్ చేసిన బీస్ట్ లుక్ ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఆయన షేర్ చేసిన ఫోటో లో ఆర్మ్ డే అంటూ మహేష్ కండలను చూపించారు. ఈ ఫోటో నెటింట్లో చక్కర్లు కోడుతుంది.

ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ – మహేష్ కలయికలో రాబోతున్న సినిమా.. పాన్ ఇండియా సినిమాగా రానుంది. పూర్తి ఢిల్లీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. కాబట్టి, సినిమాలో ఓ భారీ చేజింగ్ ఫైట్ ఎపిసోడ్‌ ఉందట. ఈ ఎపిసోడ్ షూట్ ను ఈ నెల 12 నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా కనిపించబోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ‘అరవింద సమేత, అలా వైకుంఠపురంలో ఇలా వరుస హిట్ చిత్రాలను అందించి ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు త్రివిక్రమ్. దీనికితోడు ఈ సినిమాకి ఇండియా వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అయ్యేలా ఉంది. అందుకే, మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

మంచు మనోజ్ పెళ్ళికి జూ.ఎన్టీఆర్!

కృతి పాపకు మరో క్రేజీ ఆఫర్!

కిచ్చ సుదీప్‌కు సారీ చెప్పిన పవన్‌!

- Advertisement -