తలైవా…170 కి గ్రీన్ సిగ్నల్

39
- Advertisement -

తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ వయస్సు 70 కానీ కుర్రహీరోలతో పోటీ పడుతూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం తలైవా జైలర్‌ సినిమాతో ఈ యేడాది సందడి చేయనున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జైభీమ్ దర్శకుడు టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తలైవా170 చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించింది.

లైకా ప్రోడక్షన్స్‌లో వచ్చే ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ట్వీట్టర్ ద్వారా ప్రకటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి పనిచేయడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాం అని పేర్కొంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపనున్నట్టు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి…

మహేష్ కొత్త లుక్ వైరల్

మంచు మనోజ్ పెళ్ళికి జూ.ఎన్టీఆర్!

పిక్ టాక్ : కృతి కర్బంద అందాల వెల్లువ!

- Advertisement -