మహేష్ కి విలన్ ఎవరంటే?

45
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ssmb28 లో విలన్ ఎవరనేది ఇంత వరకు చెప్పలేదు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మెయిన్ విలన్ గా జగపతి బాబు ను ఫిక్స్ చేసుకున్నాడట త్రివిక్రమ్. ప్రస్తుతానికి జగపతి బాబు ఇంకా ఘాట్ లో పాల్గొనలేదు కానీ ఈ యాక్టర్ విలన్ గా ఫిక్స్ అయినట్టే అంటున్నారు.

త్రివిక్రమ్ . ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ లో పవర్ ఫుల్ విలన్ గా జగపతి బాబు మంచి మార్కులు అందుకున్నాడు. క్రూరంగా కనిపించి మెప్పించాడు. ఆ కేరెక్టర్ కి వంద శాతం న్యాయం చేశాడు. అందుకే ఇప్పుడు జగపతి బాబు నే విలన్ గా తీసుకున్నాడట త్రివిక్రమ్.

అయితే ఇది మాస్ సినిమా కాదని, యాక్షన్ పార్ట్ ఉంటుంది కానీ కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడని అంటున్నారు. జగపతి బాబు మహర్షి లో కనిపించినట్టు స్టైలిష్ విలన్ గా కనిపించనున్నాడని సమచారం.

ఇవి కూడా చదవండి…

బాలయ్యతో మరోసారి !

ప్రభాస్ కి ఈ రిస్క్ అవసరమా?

మార్చి4… ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

- Advertisement -