నాలుగేళ్ళు దాటితే మహేష్ ఫ్యాన్స్ కి నిరాశే

41
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సాధారణంగా జక్కన్న తన డైరెక్షన్‌లో నటిస్తున్న హీరో ఏకకాలంలో మరో సినిమాలో నటించడానికి ఇష్టపడరు. పైగా సదరు హీరో లుక్ కూడా రాజమౌళి బయటకు రానియ్యడు. ఈ నేపథ్యంలో మహేశ్ – రాజమౌళి మూవీ పూర్తయ్యే దాకా.. అంటే ఓ మూడు, నాలుగేళ్ల పాటు మహేష్ సినిమాలకు బ్రేక్ పడినట్లే. ఇప్పుడు ఇదే విషయం మహేష్ బాబు ఫ్యాన్స్ ను కలవర పెడుతుంది. ఇటు గుంటూరు కారం రెగ్యులర్ మాస్ సినిమాలా ఉంది. ఈ రెగ్యులర్ సినిమా తర్వాత మరో మూడు – నాలుగేళ్ల పాటు మహేష్ నుంచి సినిమా రాకపోతే ఎలా అనేది ? ఫ్యాన్స్ ఆందోళన. ఏది ఏమైనా దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా అంటే.. మహేష్ రేంజ్ డబుల్ అయినట్టే.

Also Read: సాయి పల్లవి వల్ల అప్పులపాలు

పైగా మహేష్ తో చేసున్న ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా తీర్చిదిద్దేందుకు రాజమౌళి ఇప్పటికే ప్లాన్ చేశాడు. ఇందుకోసం రాజమౌళి ఇంగ్లీష్‌లో కూడా సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందుకే, మహేష్ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను రాజమౌళి తీసుకోబోతున్నాడు. ఆల్ రెడీ ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ను రాజమౌళి సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఐతే, మరో హీరోయిన్ రోల్ కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను కూడా జక్కన్న అప్రోచ్ అవుతున్నారని ఆ మధ్య టాక్ నడిచింది. అలాగే అన్ని కుదిరితే కొందరు హాలీవుడ్ నటీనటులను తీసుకుంటారట. మొత్తానికి మహేష్ కోసం రాజమౌళి భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. కాకపోతే ఈ సినిమా కోసం రాజమౌళి నాలుగేళ్ళ కంటే ఎక్కువ సమయం తీసుకుంటే కచ్చితంగా మహేష్ ఫ్యాన్స్ నిరాశకి గురి అవుతారు.

Also Read: ఆ అనుభవం పరమ చెత్త అట

- Advertisement -